నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం. ఈ నెల 13న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
వర్ష సూచన
విశాఖపట్నం: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
శనివారం వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. యూపీలో బీజేపీకి మెజారిటీ వస్తుందని కొన్ని.. హంగ్ తప్పదని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్యే పోటీ ఉందని అకాలీ-బీజేపీ కూటమి మూడో స్థానానికి పరిమితమౌతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి.
నాగార్జున యూనివర్సిటీలో సదస్సు
గుంటూరు: నేడు నాగార్జున యూనివర్సిటీలో అంతర్జాతీయ సదస్సు. 'కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ' అనే అంశంపై మూడు రోజుల పాటు సదస్సు జరగనుంది.
మార్పులు లేవు
ముంబై: ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు భారత జట్టులో మార్పులు లేకుండా.. అదే జట్టును కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది.