నేడు తెలంగాణ అసెంబ్లీలో 2014-15 కాగ్ నివేదిక.
► నేడు తెలంగాణ అసెంబ్లీలో 2014-15 కాగ్ నివేదిక. రాష్ట్రంలో కరువు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు, విద్యా విధానంపై నేడు సభలో చర్చించనున్నారు.
► నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ద్రవ్య వినిమయ బిల్లు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.
► హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైన్పై నేడు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.
► విజయవాడ: నేడు ఎన్టీఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం. హాజరు కానున్న గవర్నర్.
► నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటన.
► టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో న్యూజీలాండ్ జట్టు తలపడనుంది. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం
► మహిళల టీ20 వరల్డ్ కప్: నేడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్.