ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది నేడు తేలిపోనుంది
త్రివేంద్రసింగ్ రావత్ ప్రమాణం
నేడు ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్రసింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. డెహ్రాడూన్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా హాజరుకానున్నారు.
యూపీ సీఎం ఎంపిక
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది నేడు తేలిపోనుంది. ఇవాళ సాయంత్రం లక్నోలో జరిగే బీజేఎల్పీ సమావేశానికి వెంకయ్య నాయుడు, భూపేంద్రయాదవ్ పరిశీలకులుగా హాజరుకానున్నారు. రాజ్‌నాథ్‌సింగ్, మనోజ్ సిన్హా, ఆదిత్యనాథ్, మహేశ్ శర్మ సీఎం రేసులో ఉన్నారు.
బాలిక విద్యపై సమావేశం
బాలిక విద్యపై నేడు ఢిల్లీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ తొలి సమావేశం.
సాంస్కృతిక ఉత్సవాలు
తిరుపతిలో నేటి నుంచి రెండు రోజుల పాటు గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు.
విద్యార్థులకు శిక్షణ
బాసర ట్రిపుల్ ఐటీలో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ.
విజయ్ హరారే సెమీస్
ఢిల్లీ: విజయ్ హరారే ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్‌లో నేడు బెంగాల్‌తో తలపడనున్న జార్ఖండ్.