breaking news
Tiwary
-
రారా... తేల్చుకుందాం!
రంజీ మ్యాచ్‌లో కొట్టుకోబోయిన గంభీర్, మనోజ్ తివారీ న్యూఢిల్లీ: ‘సాయంత్రం కనపడురా... నీ సంగతి చెబుతా’... ‘అప్పటిదాకా ఎందుకురా... ఇప్పుడే బయటకు పద... తేల్చుకుందాం’ ఇవేవో గల్లీలో పిల్లల మధ్య గొడవలో వచ్చిన మాటలు అనుకుంటున్నారా? కాదు... ఢిల్లీలో రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు పెద్ద క్రికెటర్ల మధ్య గొడవలో సవాళ్లు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్, కోల్‌కతా సారథి మనోజ్ తివారీల మధ్య వాదన తీవ్రత పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకోబోయారు. వివరాల్లోకి వెళితే... శనివారం బెంగాల్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా రెండో వికెట్ పడగానే మనోజ్ తివారీ బ్యాటింగ్‌కు వచ్చాడు. టోపీతో వచ్చిన తివారీ క్రీజులో గార్డ్ తీసుకున్నాడు. బౌలర్ మనన్ బంతితో పరిగెడుతూ వస్తున్నాడు. ఇంతలో మనోజ్ ఒక్కసారిగా బౌలర్‌ను ఆపి... హెల్మెట్ తెమ్మని పెవిలియన్‌లో ఉన్న సహచరులను పిలిచాడు. దీనిపై ఢిల్లీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనే సమయం వృథా చేస్తున్నాడని భావించారు. ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గంభీర్ ఒక్కసారిగా మనోజ్ తివారీపై బూతులకు దిగాడు. ‘సాయంత్రం నన్ను కలువు. నిన్ను కచ్చితంగా కొడతా’ అన్నాడు. దీనికి తివారీ స్పందించి ‘సాయంత్రం వరకూ ఎందుకు, ఇప్పుడు పద బయటకెళ్లి కొట్టుకుందాం’ అని బదులిచ్చాడు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన అంపైర్ శ్రీనాథ్ ఈలోగా అక్కడికి పరిగెడుతూ వచ్చి ఇద్దరి మధ్యలోకి వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న గంభీర్... అంపైర్‌ను పక్కకు తోసేశాడు. దీంతో ఢిల్లీ ఆటగాళ్లు మరింత షాక్కులోనై వచ్చి తమ కెప్టెన్‌ను ఆపారు. బోర్డు గంభీర్‌పై 70 శాతం, తివారీపై 40 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెద్దది చేయకుండా ముగిం చాలని నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ క్రికెట్ సంఘం కూడా గంభీర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నటుల ప్రకటించిం ది. అన్నట్లు గంభీర్, తివారీ కలిసి ఐపీఎల్లో చాలా కాలం కోల్‌కతాకు ఆడారు. -
కోలుకున్న భారత్ ‘ఎ’
తొలి ఇన్నింగ్స్‌లో 165/3 బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తడబడింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (102 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), మనోజ్ తివారి (74 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చాడ్ సాయెర్స్ (3/22) ధాటికి ఒక దశలో భారత్ 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే తివారి, అపరాజిత్ (20 బ్యాటింగ్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 69 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం భారత్ మరో 258 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు 288/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్ చివరి 3 వికెట్లకు 135 పరుగులు జత చేయడం విశేషం. బెన్ కటింగ్ (117 బంతుల్లో 96; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కామెరాన్ బోయ్స్ (102 బంతుల్లో 57; 9 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 423 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్ 83 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
కాంగ్రెస్‌కు 'చెయ్యి'చ్చిన తివారీ