breaking news
tim murphy
-
అద్దంపై ప్రేమలేఖ!
ఆమె అతడిని పట్టించుకోలేదు. కానీ అతడు ఆమెను పట్టించుకున్నాడు. ఆమె తనకు కావాలనుకున్నాడు. అమె అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెబుతూ ఆమె బెడ్ రూమ్ అద్దంపై రాశాడు. ఆమైనా చూస్తుందో లేదో అనుకున్నాడు. కానీ ఇప్పుడు దాన్ని ప్రపంచమంతా చూస్తున్నారు. దాంపత్యానికి అర్థం, బాంధవ్యానికి పరమార్థం చెప్పే అతని రాతల షేర్ వాల్యూ సోషల్ మీడియాలో చాలా పెరిగిపోయింది. లాస్ ఏంజెలెస్‌లోని టిమ్ మర్ఫీ భార్య... మోలీ మర్ఫీ డిప్రెషన్లో ఉంది. ఆమె తన డిప్రెషన్‌తో అతడిని చాలా బాధపెట్టింది. అయినా ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న టిమ్ ఆమెను బాగు చేసేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఆమెను తానెందుకు ప్రేమిస్తున్నాడో చెప్పే నోట్‌ను ఆమె అద్దంపై రాశాడు. ఆమె చూడదేమోననుకున్నాడు. కానీ మోలీ దాన్ని చూసింది. చలించింది. ఆమెలో మార్పు మొదలైంది. తన భర్త నోట్‌ను ఇమ్గుర్ అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు లక్షల మంది చూశారు. ఇద్దరి మధ్య బాంధవ్యం ఇప్పుడు మరింత గట్టి పడింది. -
భార్యపై ప్రేమకు 15 కారణాలు
లాస్ ఏంజెలిస్: పెళ్లికి ముందు ప్రేమించడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. పెళ్లి తర్వాత భార్యను ప్రేమించాలంటే మాత్రం కారణాలు వెతుక్కోవాలి. నగరంలో ఇంజనీరుగా పనిచేస్తున్న టిమ్ మర్ఫీ తన భార్య పట్ల తనకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేయడానికి 15 కారణాలు వెతుక్కున్నారు. వాటిని బెడ్రూమ్లోని అద్దంపై రాసి మానసిక సంక్షోభంలో కొట్టుకుపోతున్న భార్యను రక్షించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆన్లైన్ హీరోగా మారారు. భార్యను ప్రేమించడానికి టిమ్ వ్యక్తం చేసిన కారణాలివే..... 1. ఆమె నాకు మంచి స్నేహితురాలు. 2. ఆమెగానీ, నేనుగానీ ఎప్పటికీ విడిపోము. 3. నా క్రేజీ ప్రాజెక్టులపై పనిచేసుకోవడానికి ఆమె నాకు కావల్సినంత సమయం ఇస్తోంది. 4. ప్రతిరోజు ఆమె నన్ను నవ్విస్తుంది. 5. ఆమె చాల అందమైనది. 6. నేనెంత క్రేజీ పర్సన్ అయినప్పటికీ ఆమె సహిస్తోంది. 7. నాకు తెలిసిన వాళ్లలో ఆమె దయగల తల్లి. 8. ఆమె గొంతు కోకిల కంఠం. 9. ఆమె నాతో స్ట్రిప్ క్లబ్‌కు కూడా వచ్చింది. 10. ఆమె అంతులేని విషాదాన్ని అనుభవించింది. అయినా మానవత్వం పట్ల ఆమెకున్న ఆశాభావం అపారం. 11. కెరీర్లో నాకు వచ్చిన అన్ని అవకాశాలకు అండగా నిలబడింది. ప్రతిసారి నా వెన్నంటే నడిచింది. 12. నేను ఎప్పుడూ ఎవరికి చేయని సేవ, ఆమెకు చేసేలా చేసింది. 13. ఆమె కెరీర్ దూసుకెళుతూ అద్భుతమైన జాబ్ చేస్తోంది. 14. బుల్లి జంతువులు కూడా ఆమెను ఏడిపించేవి. 15. ఆమె పగలబడి నవ్వినప్పుడు ఆయాసంతో రొప్పుతుంది. ‘ఇవి నేను నా భార్య మొల్లీ మర్ఫీని ప్రేమించడానికి కారణాలు’ అన్న శీర్షిక కింద బెడ్ రూమ్ అద్దంపై టిమ్ మర్ఫీ రాసిన పంక్తులను ఆయన భార్య చూసి ఛలించిపోయింది. కన్నీళ్ల పర్యంతమైంది. శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లే ముందు భర్తతో గొడవ పడినందుకు బాధ పడింది. ఆనందం లాంటి విషాధంలో ధారాపాతంగా కన్నీళ్లు కార్చింది. దిండంతా తడిపేసింది. తేలికైన హృదయంతో లేచి అద్దంపై భర్త రాసిన వ్యాక్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి ‘ఇమ్గూర్’ అనే సోషల్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. దాన్ని మూడు రోజుల్లోనే దాదాపు ఆరులక్షల మంది వీక్షించారు. వాస్తవానికి తన భార్యను ఉద్దేశించే తానీ వ్యాక్యాలు రాశానని, కనీసం ఆమైనా చూస్తుందన్న నమ్మకం తనకు లేకుండేనని, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చూశారని, ఇది ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతకన్నా ఆశ్చర్యం తన భార్య తనను ఉదయాన్నే నిద్రలేపి పలకరిస్తోందని టిమ్ ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. ఇది వరకు తాను తెలియని మానసిక క్షోభతో అస్తమానం భర్తతో గొడవ పడేదాన్నని, బాత్రూమ్లోకి వెళ్లి గంటల తరబడి గడియవేసుకొని అలా ఉండిపోయేదాన్నని మొల్లీ తన గురించి వెల్లడించింది. తాను ఇప్పటికీ మానసికంగా పూర్తిగా కోలుకోలేదని, తన భర్త తనకు అండగా ఉండగా, తప్పనిసరిగా కోలుకుంటానన్న పూర్తి విశ్వాసం తనకుందని ఆమె చెప్పారు. తాను ప్రతిరోజు లేవగానే అద్దంపై టిమ్ రాసిన వ్యాక్యాలను చదువుతానని, తాను ఇంకేమాత్రం ఒంటరిదాన్ని కాదన్న తృప్తి క లుగుతోందని తాజా పోస్ట్‌లో ఆమె తెలిపింది.