breaking news
Tickets to Muslims
-
‘వాళ్లు మాకు ఓటెయ్యరు.. సీట్లెందుకివ్వాలి?’
ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఓ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమకు ఓటే వెయ్యరని, అలాంటప్పుడు తాము వారికి సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ గెలవాలని ముస్లింలు కోరుకోరని, అలాంటి వారికి తామెందుకు సీట్లు ఇస్తామంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ముస్లింలకు బీజేపీ టికెట్లు కేటాయించివుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లింలకు టికెట్లు కేటాయించాల్సిందని తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు సబబనని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వినయ్ ఖతియార్ స్పందిస్తూ అసలు తాము వారికి సీట్లు ఎందుకివ్వాలని నిలదీశారు. ‘ముస్లింలు వారి ఓటును మాకు ఏనాడు ఓటెయ్యన్నప్పుడు మేమెందుకు వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలంటూ పార్టీని వెనుకేసుకొచ్చారు. ఐదు దశ ఎన్నికల్లో ఏ ఒక్క ముస్లిం అభ్యర్థి గెలవబోరని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బీజేపీకి పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమాభారతీ వ్యాఖ్యలు చేయగా అందుకు వినయ్ ఖతియార్ సమాధానం ఇచ్చారు. మరిన్ని వార్తా కథనాలకై చదవండి.. బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి -
బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ముస్లింలకు బీజేపీ టికెట్లు కేటాయించివుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లింలకు టికెట్లు కేటాయించాల్సిందని తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు సబబనని ఉమా భారతి అన్నారు. అయితే కొన్నిసార్లు ముస్లింలకు, మహిళలకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ విషయం గురించి చర్చిస్తానన్నారు. సోమవారం యూపీలో ఐదో దశ ఎన్నికలు 52 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. కీలకమైన అమేథి, అయోధ్య నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.