breaking news
ticket confirmation
-
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫార్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ల గలుగుతారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, సూరత్, వారణాసి, అయోధ్య, పాట్నా రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రైల్వే శాఖ ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు.తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలోని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేసి.. కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించాలని నిర్ణయించారు. మహా కుంభమేళా సందర్భంగా దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా వెయింటింగ్ రూములు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, సూరత్, పాట్నాల్లో రద్దీని నియంత్రించడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. రైలు విచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.60 స్టేషన్లలో తాత్కాలికంగా నిర్మించిన వెయిటింగ్ రూములను శాశ్వతంగా ఉపయోగపడేలా మార్చబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో రైళ్ల సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయిస్తారు. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఢిల్లీ స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. BIG BREAKING NEWS 🚨 Only confirmed ticket holders will be allowed to enter platforms at 60 railway stations.Big decision by Railway Minister Ashwini Vaishnav to decongest stations.Those without a ticket or with a waiting list ticket will wait in the outside waiting area.… pic.twitter.com/IEmxJok5AE— Times Algebra (@TimesAlgebraIND) March 8, 2025 -
టిక్కెట్ టెన్షన్‌తో ఓ నేతకు గుండెపోటు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల ఆశావాహులు టెన్షన్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా టిక్కెట్ టెన్షన్‌తో ఓ కాంగ్రెస్ నేత గుండె పోటుకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే....బాగ్‌అంబర్‌పేట డివిజన్లో నివసించే శ్రీరాములు ముదిరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. గత కార్పొరేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తిరిగి ఈ దఫా కూడా టిక్కెట్ కోసం మూడు రోజుల క్రితం వి.హనుమంతరావుకు దరఖాస్తు సమర్పించాడు. శ్రీరాములుకు టిక్కెట్ విషయంపై హామీ రాకపోవడంతో బుధవారం ఉదయం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడితో మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చేసమయంలో ఒక్కసారి గుండెలో నొప్పి వచ్చి కుప్ప కూలిపోయాడు. గమనించిన నాయకులు ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర విభాగంలో చికిత్స అందించడంతో కొద్ది సేపటి తరువాత కోలుకున్నాడు. సమాచారం అందుకున్న వి.హెచ్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఒత్తిడికి గురికావద్దని చెప్పాడు. ఇంత జరిగింది కానీ, టిక్కెట్‌పై భరోసా మాత్రం లభించలేదు. అన్ని పార్టీల అభ్యర్థుల్లో మరో రెండు రోజుల పాటు టెన్షన్ కొనసాగే అవకాశముంది.