breaking news
three dies in road accident
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగివున్న లారీతో పాటు ఇన్నోవా వాహనాన్ని మరో లారీ వచ్చి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందినవారిలో గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రామారావు ఉన్నారు. వీరంతా చెన్నె నుంచి బాపట్ల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు యువకుల మృతి
కడప : వైఎస్ఆర్ జిల్లాలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా కలికిరి మండలం యర్రదొడ్డిపల్లికి చెందిన సుబ్రమణ్యం , సుందరయ్య , రామాంజులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రాయచోటిలో బంధువుల ఖర్మకాండకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. రోడ్డు మీద ఆపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వీరి బైక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ లైటింగ్ ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.