breaking news
thousands crores rupees property
-
ముంబై మాఫియాను మించి.. నయీం ఆస్తులు
-
ముంబై మాఫియాను మించి.. నయీం ఆస్తులు
హైదరాబాద్: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. నయీం ఆస్తుల వివరాలు కొండాపూర్‌లో ఒకే చోట 69 ఎకరాల భూమి దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని రెవిన్యూ అధికారాలు అంచనా పుప్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చు నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో బొమ్మలరామరంలో 500 ఎకరాలు హైదరాబాద్ నగరంలో పదలుకొద్దీ ఫ్లాట్లు ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు ఆడి కారు సహా హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లు సరూర్ నగర్‌లోని ఎన్టీఆర్ నగర్లో 1180 గజాల సైటు ప్లాను స్వాధీనం గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నెంబర్ 230/231 పత్రాలు స్వాధీనం అత్తాపూర్‌లో సర్వే నెం 462, 468లో ఫ్లాటు నెంబర్ 9 పత్రాలు గుర్తింపు కొండాపూర్‌లో సర్వే 87 పత్రాలు స్వాధీనం షేక్‌పేట్‌లో మరో ఫ్లాటు పత్రాలు స్వాధీనం ముసారాబాద్లో మరో నాలుగు స్థలాల పత్రాలు గుర్తింపు జూబ్లిహిల్స్‌లో 1365 గజాల స్థలాన్ని లాక్కున్న నయీం భువనగిరిలోనే 175 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తింపు ఘట్కేసర్, రామంతపూర్ గౌలిపుర, అమీన్‌పుర ప్రాంతాలకు చెందిన భూమి పత్రాలు స్వాధీనం ఆయుధాలు, ఫోన్లు ఇప్పటివరకు 4 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్ఫోన్లు స్వాధీనం డైరీలు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, మెమొరీ కార్డుల, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం