breaking news
Thousand jobs
-
50వేల కొలువులు..ఉద్యోగ అభ్యర్థులూ సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 50 వేల ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిం చాలని సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగాల భర్తీలో స్థానికులకు న్యాయం జరగాలనేది తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటి. ఈ నినాదాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.ఇన్నాళ్లూ జాప్యం జరిగినా, కొత్త విధానానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. – సీఎం కేసీఆర్ గతంలో అంతా అస్తవ్యస్తం గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్య స్తంగా ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానిం చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమించి, అత్యంత శాస్త్రీయ విధానాన్ని అను సరించి కొత్త జోనల్ విధానానికి రూపకల్పన చేసిం దని తెలిపారు. ‘ప్రస్తుతం ఈ కొత్త విధానంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. అన్ని ప్రభుత్వశాఖల్లో నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్ట్ట్ రిక్రూట్మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వీటిని తొలి విడతలో భర్తీ చేస్తాం. రెండో విడతలో ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా నింపుతాం. ఇప్పటికే అన్ని శాఖల్లోనూ ప్రమోషన్ల ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు, వాటి మూలంగా ఏర్పడే ఉద్యోగ ఖాళీలకు సంబంధిం చిన పూర్తి సమాచారంతో నివేదిక తయారు చేసి ఈనెల 13న జరిగే కేబినెట్ సమావేశానికి తీసుకు రండి..’ అని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఏ వేవ్‌కైనా సంసిద్ధంగా.. ♦ ఇతర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై అధ్యయనం చేయండి ♦ సరిహద్దు జిల్లాల్లో కూడా మూడురోజులు పర్యటించాలి ♦ కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్‌కు నివేదిక సమర్పించాలి ♦ కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి ఫీవర్ సర్వే ఏ వేవ్ ఎప్పుడు వస్తదో, ఎంతవరకు విస్తరిస్తదో ఎవరికీ తెలియట్లేదు ♦ మహమ్మారి కట్టడికి ప్రభుత్వంతో కలసి రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి -
వ్యవసాయ శాఖలో వెయ్యి ఉద్యోగాలు
2 వేల హెక్టార్ల భూ విస్తీర్ణానికి ఒక విస్తరణాధికారి: పోచారం హన్మకొండ: రాష్ట్రంలో ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి ఉండాలనే ఉద్దేశంతో వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖాళీగా ఉన్న 120 వ్యవసాయ అధికారి పోస్టులు, ఉద్యాన శాఖలోని 70 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు వివరించారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను ఆయన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలసి ప్రారంభించారు. ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని పోచారం తెలిపారు. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల్లో ఇక నుంచి వ్యవసాయ అధికారి చీటి రాస్తేనే ఆ రైతుకు క్రిమి సంహారక మందులు విక్రరుుంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమీక్ష సమావేశంలో పోచారం చెప్పారు.