breaking news
Thirumala Yatra
-
తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వచ్చే శాసనసభ సమావేశాల నాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్షకు దిగుతానని గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రజలకు మేలు చేసే కొత్త యువ నాయకత్వాన్ని అందించింనందుకు కృతజ్ఞతగా ఈ నెల 4న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించిన తిరుమల పాదయాత్ర 8వ రోజైన బుధవారం నాటికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ శివార్లలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయి ఫంక్షన్‌హాలులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, అది జీర్ణించుకోలేని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
3 నైట్స్/4 డేస్... ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
కాచిగుడ : తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవాలని చాలా మందికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ దేవుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నుంచి వెంకటేశుని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునే వారికి దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కాచిగుడా నుంచి రూ.5400 ప్రారంభ ధరకు నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుందని ట్వీట్ ద్వారా తెలియజేసింది. బాలాజి దేవస్థానంతో పాటు ఆ పక్కనే దగ్గరిలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకుని రావచ్చట. మూడు రోజులు, నాలుగు రోజులు కలిగిన ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ‘వెంకటాద్రి’ పేరుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ‘వెంకటాద్రి’ టూర్ ప్యాకేజీ వివరాలు... ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేసే గమ్యస్థలం తిరుపతి. ట్రైన్, రోడ్డు మార్గన ప్రయాణానికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8.05లకు కాచిగుడ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్ టిక్కెట్లు ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ కింద ఒక్కో వ్యక్తి ఈ టూర్ ఖర్చు రూ.5750 అవుతుంది. కంపోర్ట్ క్లాస్ కింద టూర్ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ.9038 అవుతుంది. యాత్రికులు/పర్యాటకులందరూ కూడా తమ వెంట ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించకపోతే, టీటీడీ సిబ్బంది భక్తులను వెంకటేశుడి దర్శనానికి అనుమతించరు. -
ఒక్క రోజులో వెంకన్న దర్శనం
-
ఒక్క రోజులో వెంకన్న దర్శనం
తిరుపతికి ప్రత్యేక గగనతల పర్యాటక ప్యాకేజీ - ఒక్కరోజు ప్యాకేజీ ధర రూ.10 వేలు, రెండు రోజులకు రూ.13 వేలు - విమాన టికెట్, దైవదర్శనం, రవాణా, భోజనం, వసతి అన్నీ కలిపే ధర - కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర - అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ, టీఎస్‌టీడీసీ - మే రెండో వారంలో ప్రారంభించనున్న మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు వచ్చేశాయ్.. ఆధ్యాత్మికం.. వినోదాన్ని కలగలుపుతూ.. విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? మీలాంటి వారి కోసమే సరికొత్త ప్యాకేజీలను తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకొస్తున్నాయి. ఒక్కరోజులోనే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరుకునేలా ప్రత్యేక గగనతల ప్రయాణ ప్యాకేజీలను తెలంగాణ ప్రజల ముంగిటకు తెచ్చాయి. దైవదర్శనంతో పాటు భోజనం, వసతి, రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తాయి. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం(తిరుచానూరు), శ్రీకాళహస్తి వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ యాత్రకు శ్రీకారం చుట్టాయి. ఇలాంటి యాత్రనే 2009–10లో ప్రారం భించినా.. ఆ తర్వాత వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు ఈ స్పెషల్ ప్యాకేజీలను తిరిగి ప్రారంభిస్తున్నారు. దీనికోసం విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యాత్రను మే రెండో వారంలో రాష్ట్ర పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించనున్నారు. ‘ఒక్కరోజు’ ప్యాకేజీ ఇలా.. హైదరాబాద్‌లో ఉదయం 6.55 గంటలకి యాత్ర మొదలవుతుంది. ఉదయం 8.10కి తిరుపతికి.. అక్కడి నుంచి 9.30కి తిరుమల చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 మధ్య వేంకటేశ్వ రుని శీఘ్రదర్శనం పూర్తవుతుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పిస్తారు. అటు తర్వాత తిరుచానూరు తీసుకెళ్లి పద్మావతీ అమ్మవారి దర్శనాన్ని 3.30 నుంచి 4 గంటల మధ్య కల్పిస్తారు. సాయంత్రం 5.35 గంట లకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. శనివారం మాత్రం తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాత్రి 8.25కి చేరుకుంటారు. రాత్రి 9.40కి హైదరాబాద్ వస్తారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు దాకా ధర నిర్ణయించారు. ‘రెండు రోజుల’ ప్యాకేజీ ఇదీ.. హైదరాబాద్‌లో ఉదయం 9.25కి బయలుదేరి.. 10.45కి తిరుపతి చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ శివుని దర్శనం పూర్తి కాగానే.. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కాణిపాకం లేదా తిరుచానూరు తీసుకెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు తిరుపతి ఫార్చ్యూన్ కేన్సస్ హోటల్లో రాత్రి బస కల్పిస్తారు. మరుసటి రోజు ఉదయం 9.30కి తిరుమల చేరుకుంటారు. 10 గంటల నుంచి 12.30 మధ్య శీఘ్రదర్శనం కల్పిస్తారు. 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పించి, 3.30 నుంచి 4 గంటల మధ్య కాణిపాకం లేదా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6.35కి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 7.45కి హైదరాబాద్ చేరుకుంటారు. శనివారం మాత్రం రాత్రి 8.25కు తిరుపతి ఎయిర్‌పోర్టుకు.. రాత్రి 9.40కి హైదరాబాద్‌కు చేరుకుంటారు. విమాన చార్జీలు, ఏసీ అకామిడేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, భోజనం, దైవదర్శనం అన్నీ కలుపుకుని టికెట్ ధరను రూ.13 వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. బుకింగ్ కోసం.. విమానంలో తిరుపతి వెళ్లాలనుకునే వారు టీఎస్‌టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్–9848540371, ట్యాంక్‌బండ్ రోడ్డు–9848125720, పర్యాటక భవన్– 9848306435, శిల్పారామం 040–23119557, కూకట్పల్లి 040–23052028, సికింద్రాబాద్ యాత్రీ నివాస్–9848126947, వరంగల్ 0870– 2562236, నిజామాబాద్ 08462–224403, మార్కెటింగ్ డివిజన్ 040–23412129, 8096947700ల్లో సంప్రదించవచ్చు.