breaking news
TGVP
-
సామాజిక తత్వాన్ని అర్థం చేసుకోవాలి
రాజ్యాధికారం వైపు వెళ్లేవారు ఆత్మహత్య చేసుకోరు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్ కేయూ క్యాంపస్ : రాజాధ్యికారం వైపు వెళ్లేవారు ఆత్మహత్య చేసుకోరని, రాజకీయ, సామాజిక తత్వాన్ని అర్థం చేసుకోకుండా ముందుకు పోవడం అసాధ్యమని కేయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ సీహెచ్.దినేష్‌కుమార్‌అన్నారు. టీజీవీపీ ఆధ్వర్యంలో గురువారం కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్‌హాల్‌లో యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. సావిత్రిభాయి, అంబేద్కర్ కొన్నివేల సార్లు అవమానాలు ఎదుర్కొన్నారని, అయినా మొక్కవోని దీక్షతో ముందుకుసాగారని తెలిపారు. సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడుతూ మనం రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంక్షోభంలో ఉన్నామన్నారు. విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పోటీతత్వం పెరిగిందని వివరించారు. ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయని తెలిపారు. ఏదిఏమైనా పోరాడి సాధించుకోవాలన్నారు. డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ మనది కాని ఎజెండా కోసం విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో కులం అనే రక్కసి ఉందన్నారు. శాస్త్రీయ విద్యావిధానం ద్వారానే ఆత్మహత్యలను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, కవి అన్వర్, డాక్టర్ రాంచంద్రం, డాక్టర్ మంద వీరస్వామి, టీజీవీపీ నాయకులు ఇట్టబోయిన తిరుపతి, మేడ రంజిత్,రడపాక విజయ్, దినేష్, రణధీర్, నరేష్, రాజు, గొడుగు మనోజ్, రాజేందర్, సారయ్య, ప్రశాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కోదాడఅర్బన్: తెలంగాణ విద్యార్థి పరిషత్(టీజీవీపీ) 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం పట్టణంలో ఆ సంఘం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్ వంశీ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన తమ సంఘం ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందన్నారు. ఆగష్టు 6న∙లక్ష మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిభార్గవ్, సాల్మన్, ప్రసాద్, రమేష్, రవి, నితిన్, గోపినా«ద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.