breaking news
ten people injured
-
రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు
విజయనగరం క్రైమ్: స్థానిక కెఎల్.పురం రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆటోను వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు... బొండపల్లి మండలానికి చెందిన మజ్జి సూర్యనారాయణ, దొంతల జమ్మన్న, గెద్ద రమణ, చిల్ల శ్రీను, అలమండ రమణ, సాసుబిల్లి అప్పారావు, కోరాడ అచ్చిరాజు, మీసాల నారాయణరావు, బొబ్బిలికి చెందిన చైతన్యతో పాటూ అంబటివలసకి చెందన పీతల రాంబాబులు గూడ్స్ వద్ద జరుగుతున్న కలాసీ పనులకు గురువారం ఆటోలో వెళ్తున్నారు. స్థానిక ద్వారపూడి రైల్వే బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి జైపూర్ నుంచి విశాఖ వైపు రోగులను తీసుకువెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్ ఢీకొంది. దీంతో ఆటో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అదే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వారిలో సాసుబిల్లి అప్పారావు, కోరాడ అచ్చిరాజు, మీసాల నారాయణరావుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ ఎస్ఐ విజయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జెయింట్ వీల్ ప్రమాదం:10 మందికి గాయాలు
ఉంగుటూరు: కృష్ణా జిల్లా రంగమ్మ పేరంటాళ్ల తిరునాళ్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో తిరునాళ్లు సందర్భంగా జెయింట్ వీల్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అది తిరుగుతుండగా ఒక చెయిర్ వద్ద బోల్టు అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో దానిపై కూర్చున్న పది మంది యువకులు కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స్ అందించారు.