breaking news
Telugu lecturers
-
అంతర్జాతీయ సదస్సుకు సిద్ధిపేట అధ్యాపకురాలు
సాక్షి, హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న నందిగామ నిర్మల కుమారి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ), అయోధ్య రీసెర్చ్ సెంటర్ సంయుక్త సారథ్యంలో ‘రామచరిత మానస శాస్త్రీయ అధ్యయనం’ అనే అంశంపై అక్టోబర్ 13, 14 తేదీల్లో కాకినాడలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో నిర్మల కుమారి తన పరిశోధనా పత్రం ‘భక్తి : పుట్టుక ప్రస్తానం, ఉద్యమం’ ను సమర్పించనున్నారు. తెలుగులోనేకాక ఇంగ్లీష, హిందీ భాషల్లోనూ పలువురు పరిశోధకులు తమ పత్రాలను ఈ సదస్సులో సమర్పించనున్నారు. ఎంపిక చేసిన పరిశోధనా పత్రాలను ఒక పుస్తకంగా, సదస్సురోజే ఆవిష్కష్కరించనున్నారు. సిద్ధిపేట అధ్యాపకురాలు నిర్మల కుమారి ఇప్పటికే ఒక పుస్తకాన్ని రచించడంతోపాటు దాదాపు ఆరు అంతర్జాతీయ, 14 జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. ‘భక్తి : పుట్టుక ప్రస్తానం, ఉద్యమం’ పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్న సందర్భంగా నిర్మల కుమారిని పలువురు అధ్యాపకులు అభినందించారు. -
ఇంకా ఆందోళనే!
ఉగ్రవాదుల చెరలోనే తెలుగు లెక్చరర్లు సాక్షి, హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న నగరానికి చెందిన ఇద్దరు లెక్చరర్లను ఇంకా విడుదల చేయకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అల్వాల్‌కు చెందిన బలరాం, నాచారానికి చెందిన గోపీకృష్ణ ఉగ్రవాదుల చేతికి చిక్కి వారం రోజులు కావస్తున్నా, ఇప్పటికీ విడిచిపెట్టకపోవడంపై వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన లక్ష్మీకాంత్, అదే రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ విడుదలైనా, ఇప్పటివరకు తమవారిని వదిలిపెట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం తమ వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నించాలని వేడుకుంటున్నారు.