breaking news
Tellaresan cards
-
కిరోసీన్ మారుతోంది
నల్లబజారుకు తరలుతున్న బ్లూ కిరోసిన్ చాకచక్యంగా దోపిడీ చేస్తున్న డీలర్లు లీటర్ కిరోసిన్ రూ.30 వరకు విక్రయం కన్నెత్తి చూడని అధికార గణం లబోదిబోమంటున్న కార్డుదారులు పేదలకు అందాల్సిన సబ్సిడీ కిరోసిన్ చౌకదుకాణాల డీలర్ల చేతివాటంతో యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. లీటరు కిరోసిన్ రూ.30 వరకు విక్రరుుంచి జేబులు నింపుకుంటున్నారు. దీనిపై ప్రశ్నించిన కార్డుదారులపై కొందరు డీలర్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో మొత్తం 10,27,892 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులు ఉన్నారుు. ప్రతినెలా ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా సబ్సిడీపై 11.4 లక్షల లీటర్ల మేరకు కిరోసిన్ పంపిణీ చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు లీటరు రూ.15 చొప్పున, గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు లీటరుకు రూ.4 చొప్పున పెంపుదల చేసి రూ.19 మేరకు విక్రరుుస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెల కోటా నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న 6,95,188 కుటుంబాలకు పెంపుదల చేసిన రేట్లు వర్తిస్తారుు. ఇలా దోపిడీ సబ్సిడీ కిరోసిన్‌ను చౌకదుకాణాల ద్వారా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు పంపిణీ చేయాలి. బియ్యం, చక్కెర, వివిధ సరుకులతోపాటు కిరోసిన్‌నూ డీలర్లు ఒకేసారి అందించాలి. అరుుతే కొందరు డీలర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ సరుకులు అందించే సమయంలో కిరోసిన్ ఇవ్వడం లేదు. ఇదేమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే ‘కిరోసిన్ ఇవ్వడం వల్ల చేతు లు పాడవుతారుు, అదే చేతులతో రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల అవికూడా కిరోసిన్ వాసన వస్తా రుు, వారం తరువాత రండి’.. అంటూ బోల్తాకొట్టిస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో కిరోసిన్ ఇచ్చినట్లు వేలిముద్రలు వేసి తిప్పి పంపుతున్నారు. తీరా వారం తర్వాత వచ్చినాలబ్ధిదారులకు కిరోసిన్ ఇవ్వడంలేదు. టైం అరుుపోరుుందంటూ బుకారుుస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ‘అధికార’ అండదండలు చూసుకుని కొందరు భౌతిక దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ఏజెంట్లు సబ్సిడీ కిరోసిన్‌ను నల్ల బజారులో విక్రరుుంచేందకు ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లోని ప్రొవిజన్ షాపులు, చిల్లర దుకాణాలను వారు ఆవాసంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. డీలర్లు దోపిడీ చేసిన కిరోసిన్‌ను గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఏజెంట్లకు తరలిస్తున్నారు. వారి వద్ద రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఏజెంట్లు సేకరించిన కిరోసిన్‌ను లారీ డ్రైవర్లు, ఫ్యాక్టరీలకు రూ.40 చొప్పున విక్రరుుస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేమి చౌకదుకాణాల్లో రేషన్, కిరోసిన్ పంపిణీపై ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అరుుతే సంబంధిత అధికారులు చౌకదుకాణాలకు వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నారుు. కిరోసిన్ ఇవ్వడంలేదు ప్రతినెలా 1 నుంచి 15 తేదీ వరకు రేషన్ మాత్రం ఇస్తున్నారు. కిరోసిన్ ఇవ్వడంలేదు. డీలర్‌ను ప్రశ్నిస్తే మేము ఉన్నప్పుడు వస్తే ఇస్తాం, లేదంటే ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. - అశ్విని, గిరింపేట, చిత్తూరు -
బియ్యం బొక్కుతున్న ‘తెల్ల’దొరలు
వీరఘట్టం: రేషన్‌కార్డులే కాదు.. అంత్యోదయ కార్డులు కూడా అనర్హుల చేతుల్లో పడి దుర్వినియోగమవుతున్నాయి. ఒక్కో కార్డు మీద నెలనెలా రూపాయికే కిలో రేటుకు 35 కిలోల బియ్యం పొం దుతున్నారు. వీటిని ఎక్కువ ధరలకు అమ్ముకొని లబ్ధి పొందుతున్నారు. మరోవైపు అర్హులైన పేదలు కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. రికార్డుల ప్రకారం వీరఘట్టం మండలంలో 18 వేల కుటుంబాలు ఉండగా, అంతకంటే ఎక్కువగా 21371 కార్డులు చెలామణీలో ఉన్నాయి. వీటిలో అంత్యోదయ 1292, అన్నపూర్ణ 46,రచ్చబండ కూపన్లు 1271, తెల్లరేషన్ కార్డులు 18,762 ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం వీటిలో సగం వరకు బోగస్ కార్డులే ఉంటాయి. అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 35 కిలోలు, తెల్ల కార్డుల్లో నమోదైన ఒక్కో సభ్యునికి నెలకు 5 కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ విధం గా మండలంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు 30,050 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతున్నాయి. ఇందులో 50 శాతం మేర అర్హత లేని వారు బినామీ కార్డుదారులకే దక్కుతున్నాయి. ఈ బియ్యాన్ని బోగస్ కార్డుదారులు కిరాణా దుకాణాల్లో క్వింటాల్‌కు రూ. 1000 నుంచి రూ.1200 వరకు అమ్ముకుంటున్నారు. ఇదే బియ్యాన్ని ప్రభుత్వం రూ.2,346కు కొనుగోలు చేసి రూ.100కే పేదలకు అందజేస్తోంది. మిగిలిన రూ.2,240ను ప్రభుత్వం సబ్సిడీరూపంలో భరిస్తోంది. ఉత్తుత్తి సర్వేలు మండలంలో బోగస్ రేషన్‌కార్డులు ఉన్నట్టు రెం డేళ్ల క్రితం గుర్తించారు. అప్పట్లో రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు అధికారులు సర్వే చేసి 300 బోగస్ కార్డులను తొలగించారు. మొక్కుబడిగా జరిగిన ఈ సర్వే వల్ల పూర్తిస్థాయిలో బోగస్ కార్డులు బయటపడలేదు. క్షేత్ర స్థాయి సర్వేలు చేయకుండా వారం రోజుల పాటు అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో కూర్చొని ఏవో కొన్ని కార్డులను రద్దు చేశారు. కాగా ఇటీవల రెవెన్యూ అధికారులు అనర్హుల నుంచి తెల్లకార్డులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తెల్లరేషన్ కార్డులు తీసుకోకూడదని స్పష్టం చే శారు. అనర్హుల వద్ద తెల్లరేషన్‌కార్డులు ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అందువల్ల వాటిని తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించాలని సూచిం చారు. అయినా ఇంతవరకు ఎవరూ ఏ ఒక్కరూ స్పం దించలేదు, బోగస్ కార్డులు కార్యాలయానికి చేరలేదు. క్రిమినల్ కేసులు పెడతాం అర్హత లేకుండా రేషన్‌కార్డులు, ఐఏవై కార్డులు కలిగి ఉన్నవారెవరినీ వదలమని తహశీల్దార్ ఎం.వి.రమణ అన్నారు. స్వచ్ఛందంగా రేషన్ కార్డులు అందజేస్తే వదిలేస్తామని, గడువు దాటిన తర్వాత కూడా బోగస్ రేషన్ కార్డులు ఉంచుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వసూలు చేస్తామని స్పష్టం చేశారు.