breaking news
Tamil Heros
-
స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి
తమిళ నిర్మాతలు ఎట్టకేలకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లపాటు సినిమాపై లాభమొచ్చినా నష్టమొచ్చినా దాన్ని నిర్మాత మాత్రమే భరించేవాడు. కానీ ఇకపై అలా కుదరదని, స్టార్ హీరోలందరూ పూర్తి రెమ్యునరేషన్ తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా నిర్మాతతో పాటు లాభనష్టాల్ని భరించాల్సి ఉంటుందని ఓ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో తమిళ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నారు.తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ రకంగా స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య లాంటి వాళ్లకు నిజంగానే షాకింగ్. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తి పారితోషికం తీసుకునేవారు. లాభాలు వస్తే నిర్మాత ఇష్టం కొద్దీ కారు లాంటి బహమతులు ఇచ్చేవారు. అదే నష్టమొస్తే మాత్రం హీరోలు, నిర్మాతల్ని అస్సలు పట్టించుకోని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఓ రకంగా నిర్మాతలకు మంచిదే. కానీ హీరోలు దీనికి ఒప్పుకొంటారా అనేది చూడాలి. ఇలాంటిది తెలుగులో ఇండస్ట్రీలోనూ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)ఇదే సమావేశంలో ఓటీటీ డీల్స్ గురించి నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. మిడ్ రేంజ్ హీరోలైతే 6 వారాలు, చిన్న బడ్జెట్ చిత్రాలతే 4 వారాల రూల్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తమిళంలో రిలీజయ్యే 250 చిత్రాలకు థియేటర్ల కేటాయింపు కోసం ప్రత్యేక పద్ధతి తీసుకురానున్నట్లు తెలిపారు.తమిళ నటీనటులు అందరూ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కంటే థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్మాతల మండలి కోరింది. ఇండస్ట్రీ బాగు కోసమే ఇలా చేయాలని పేర్కొంది. అయితే నిర్మాతల మండలి తీసుకున్న ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి గానీ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి) -
తమిళ హీరోల వెనుక పడుతున్న తెలుగు డైరెక్టర్స్.. కారణం..!
-
హీరోలపై తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలో హీరోల దోపిడీ ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళంలో ఒక సినిమా వందకోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో రూ. 50 కోట్లు హీరోలే తీసుకుంటున్నారని వాపోయారు. కానీ తెలుగు హీరోలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని, రూ.15 కోట్లు ఇచ్చినా సినిమా చేస్తారని అన్నారు. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం అంతుకు పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ పద్దతి తమిళంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న నాపేరు సూర్య చిత్రం తమిళ వెర్షన్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానవేల్ రాజ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోల మద్య తేడాలను చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుహీరోల్లాగే తమిళ హీరోలు కూడా దారికి రాకపోతే తమిళ సినిమాలు మానేస్తానంటూ హెచ్చరించారు. తమిళ పరిశ్రమలో హీరోలకు, నిర్మాతలకు ఎప్పుడు కెమిస్ట్రీ కలవదని అన్నారు. తనకు హైదరాబాద్‌లో ఆఫీస్ ఉందని.. పూర్తిగా టాలీవుడ్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయానని, ఇంకా తమిళ సినిమాలు చేసి చేతులు కాల్చుకోలేనని తేల్చి చెప్పారు. తెలుగు సినమాలు చాలా రిచ్‌గా ఉంటాయని అందుకే ఉత్తరాదిన వాటికి మంచి డిమాండ్ ఉందని జ్ఞానవేల్ రాజ వ్యాఖ్యానించారు. -
తారలు దిగొచ్చేనా?
తారలు దిగొచ్చేనా అని ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చ సాగుతోంది. తారలేంది.. దిగి రావడమేంది.. అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవండి. కోలీవుడ్‌లో ప్రముఖ నటుల పారితోషికాలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా నిర్మాతలు నిలబడలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న నిర్మాతలు నిలువునా మునిగిపోతున్నారు. పెళ్లాం మెడలో పుస్తులు, ఉన్న ఇళ్లు అమ్మినా సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాబట్టుకోలేక ఆది చిత్రంతోనే అంతం అయిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా నష్టాలకు గురిచేయడంతో చాలామంది నిర్మాతలు చిత్ర రంగం నుంచి బయటపడాలని చూస్తున్నారు. జాగోరో జాగో అన్నట్లు చిత్ర పరిశ్రమ ఆలస్యంగానైనా మేల్కొన్నట్లు తెలిసింది. భారంగా మారిన చిత్ర నిర్మాణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా ప్రముఖ నటీనటుల పారితోషికాలు తగ్గించుకోవాలన్న అంశాలపై యావత్ తమిళ చిత్ర పరిశ్రమ త్వరలో సమావేశం కానుంది. -తమిళసినిమా చిత్ర నిర్మాణ సంఖ్య అధికం.. చిత్ర నిర్మాణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 1990 ప్రాంతంలో ఏడాదికి 80 చిత్రాలు మాత్రమే నిర్మాణమయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 300 వరకూ పెరిగింది. చిన్న బడ్జెట్ చిత్రాల వ్యయం రెండు కోట్లు దాటుతుంటే భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం రూ.60 కోట్లు దాటింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు చిన్న చిత్రాల ఆయువు ఒకటి లేదా రెండు రోజులకు పడిపోయింది. మరో విషయం ఏమిటంటే ఇందులో చాలా మంది నిర్మాతలు కొనుగోలుదారులు లేక పంపిణీదారులు ముందుకు రాక రిస్క్ చేసి సొంతంగా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వారు మలి చిత్రం తీసే అవకాశం ఉండడం లేదు. మరి కొంతమంది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమై చిత్రాలను విడుదల చెయ్యడానికి మొండిగా ప్రయత్నించినా థియేటర్లు దొరకడం లేదు. లింగాకు యాగీ.. సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో నటించిన బాబా, కుచేలన్ చిత్రాలు పరాజయం పొందటంతో ఆ చిత్ర కొనుగోలుదారులకు రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించారు. న్యాయంగా చెప్పాలంటే నటులు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. మానవత్వంతో చేసిన రజనీకాంత్‌ను అందరూ అభినందించారు. అలాంటి పరిస్థితే ఇటీవల లింగాకు ఏర్పడింది. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనలు, నిరాహార దీక్షలు అంటూ పెద్ద యాగీనే చేశారు. ఆ చిత్రానికి రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఇలానే మరికొందరు ప్రముఖ నటులు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తమ తదుపరి చిత్రాలను ఇచ్చి లబ్ధి పొందేలా చేస్తున్నారు. టికె ట్ల వెల తగ్గింపు.. తమిళ చిత్ర పరిశ్రమ ఇలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఇటీవల చెన్నై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను రాయితీల ఫలం ప్రేక్షకులకే దక్కాలని తీర్పును వెల్లడించింది. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.120 టికెట్ వెలను 85కు తగ్గించాల్సి ఉంటుంది. ఇది నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు దిగ్భ్రాంతి కల్పించే అంశం. టికెట్ ధర తగ్గింపు అనేది తమకు మరింత భారం పెంచుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దీని నుంచి బయట పడాలంటే చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగించడమే ఏకైక మార్గమనే నిర్ణయానికి వచ్చారు. నష్టపరిహారం చెల్లిస్తున్న నటులు.. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలైనా లాభాలు గడిస్తున్నారా అంటే చాలా మంది పెట్టుబడులు కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరో పక్క చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోతే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్ట పరిహారం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. చుక్కలు చూపిస్తున్న పారితోషికాలు.. ప్రముఖ నటీనటుల పారితోషికాలు నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాయి. పాపులర్ హీరోలు ఇప్పుడు 25 నుంచి 40 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. యువ హీరోలు 10 నుంచి 20 కోట్లు పుచ్చుకుంటున్నారు. ఇక హీరోయిన్లు తామేమీ తక్కువా అన్నట్లు కోటి నుంచి రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడొకరు రోజుకు 10 లక్షల చొప్పున పారితోషికం నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. చిత్రం నష్టాన్ని చవిచూస్తే నటీనటులు 20 శాతం పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా అది అమలు కావడం లేదు. చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించడంలో భాగంగా నటీనటులు పారితోషికాలను తగ్గించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చిత్ర ప్రముఖులు త్వరలో సమావేశమై నటీనటుల పారితోషికాల తగ్గింపుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే తారలు దిగివస్తారా? నలిగిపోతున్న నిర్మాతలకు చేయూతనిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
తమిళ అగ్రహీరోల యుద్దం


