breaking news
takes off shirt
-
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం -
'గంగూలీకి తప్ప.. నీకు సరిపోదు'
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ ఆదిర్ రంజన్ చౌదురి రోడ్డుపై తన చొక్కా విప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. చొక్క విప్పడం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి మాత్రమే సరిపోతుందని, ఇతరులకు సరిపోదని అన్నారు. విషయమేంటంటే.. పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ తృణమాల్ కాంగ్రెస్ దౌర్జన్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్‌లో చౌదురి తన చొక్కా విప్పి, కాల్చండంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. కాగా కాంగ్రెస్ బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలావుండగా 2002లో లండన్ లార్డ్స్ స్టేడియంలో నాట్‌వెస్ట్ ట్రోఫీలో విజయానంతరం అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ చొక్కా విప్పి విజయసూచికగా గాల్లో తిప్పిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. మమత ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ చీఫ్ చర్యపై పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరును మమత విమర్శించారు.