breaking news
syamalarani
-
నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదయింది. ‘నా మనస్సు నిన్ను కోరె’ నవల రచయిత్రి శ్యామలారాణి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు తన నవలలోని స్టోరీని అనుమతి లేకుండా కాపీ కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత దిల్ రాజుపై పోలీసులు 120ఏ, 415, 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ప్రభాస్ హీరోగా కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రానికి ధశరథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. -
కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహం
సమస్యలు పరిష్కరించాలని వైద్యుల డిమాండ్ ఆదిలాబాద్ అర్బన్ : డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట డాక్టర్లు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి కుమ్రం భీం చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశ్, కె.మనోహర్ మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేంద్ర సంఘం పిలుపు మేరకు దేశంలో డాక్టర్లంతా సత్యాగ్ర హం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకు తగిన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చిన్నచిన్న క్లినికల్ పొరపాట్లను సాకుగా చూపి డాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం డాక్టర్లను అనవసరమైన కేసులలో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్యవృత్తి మానవీయ కోణంతో ముడిపడి ఉన్నందున చట్టం నుంచి డాక్టర్లను మినహాయించాలన్నారు. అల్లోపతి డాక్టర్లు మాత్రమే అల్లోపతి మందులు ఇవ్వాలని, మరే డాక్టర్లు అల్లోపతి మందులు ఇచ్చినట్లరుుతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైద్యులు మనోహర్, శ్యామలారాణి, అనిల్ చిద్రాల, మహాభలేశ్వర్, లీనా గుజరాత్, తిప్పేస్వామి, నరోత్తమ్‌రెడ్డి, రవికాంత్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.