breaking news
swimming fool
-
కామన్వెల్త్లో ఓ ఫన్నీ సన్నివేశం
-
హీరో ఇంట్లో స్నానం చేసిన అభిమాని!
సినీ తారలంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ అభిమానుల్లో వీరాభిమానులు వేరు! అలాంటి ఓ వ్యక్తి.. తను అమితంగా ఆరాధించే హీరోగారు జలకాలాడే 'స్విమ్మింగ్ పూల్'లో ఒక్కసారైనా స్నానం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేశాడు. కానీ చివరలో సెక్యూరిటీకి దొరికిపోయాడు. దాంతో విషయం సదరు హీరోకి తెలిసి అతడికి తనపట్ల ఉన్న క్రేజ్‌కు అవాక్కయ్యి ఓ చిరునవ్వు నవ్వుకుని ఊరుకున్నాడు. ఆ క్రేజీ స్టారే బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. షారుఖ్ 'ఫ్యాన్' సినిమా ప్రమోషన్లో ఉండగా 'మీ అభిమానులకు సంబంధించి మీకు గుర్తున్న ఓ క్రేజీ సంఘటనను చెప్పండి' అని అడిగిన విలేకరులతో షారుఖ్ కొన్నాళ్ల క్రితం తను ఇంట్లో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఓ రోజు ఓ అభిమాని చాకచక్యంగా షారుఖ్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించడమే కాకుండా.. ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్‌లో స్నానం కూడా కానిచ్చేశాడట. చివరలో సెక్యూరిటీ గార్డులు గుర్తించి అతన్ని పట్టుకుని నిలదీయగా.. 'షారుఖ్ స్నానం చేసే చోట ఒక్కసారైనా నేను కూడా స్నానం చేయాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను' అని చెప్పాడట! 'ఇంకా నయం, ఇంతకుముందు నేను 'లక్స్' సోప్ యాడ్‌లో చుట్టూ హీరోయిన్ల మధ్య బాత్ టబ్‌లో కనబడినట్లు.. అతనికి కూడా అలానే చేయాలనే ఆలోచన కలగలేదు, అదే జరిగితే ఏమై ఉండేదో ఏమో' అంటూ చమత్కరించాడు కింగ్ ఖాన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న 'ఫ్యాన్' సినిమాలో సినీతారగా, అభిమానిగా షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. -
రంగుల కేళీకి రెడీనా!
కలర్‌ఫుల్ కేళీ... హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు నగరంలోని రిసార్ట్స్, క్లబ్‌లు, స్టార్ హోటళ్లు ముస్తాబవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో మస్తుగా ఎంజాయ్ చేసి ఫెస్ట్‌ను మెమరబుల్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈజిప్ట్ స్టైల్: హోలీని ఇళ్లలో, వీధుల్లో స్నేహితులతో కలిసి చేసుకునే అలవాటు ఉన్న మనకు కొంగొత్త తరహాలో రంగుల ఆటను చూపించనుంది బెంగళూరు హైవే కొత్తూరు సమీపంలోని పెప్పర్స్ పోర్టు రిసార్ట్. బాలీవుడ్ మ్యూజిక్కు యువత స్విమ్మింగ్ పూల్‌లోనే స్టెప్పులేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫుల్ జోష్ కోసం డీజేల మ్యూజిక్‌తో కలర్‌ఫుల్ రెయిన్ డ్యాన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈజిప్టులోనే హోలీ చేసుకున్నామా అనే ఫీలింగ్ కలిగించేలా... ఆ దేశంలో ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆర్గానిక్ రంగుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల ఆటని అస్వాదించడంతో పాటు స్పెషల్ ఫుడ్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. పుడ్ భళా: రంగుల ఆటల్లో మునిగితేలే నగరవాసులకు హోలీ రోజున పసందైన వంటకాలను వండి వార్చనున్నాయి హోటళ్లు. సంప్రదాయంతో పాటు, స్పైసీ రుచులను ఆస్వాదించాలనుకొనేవారు బేగంపేట్‌లోని హోటల్ తాజ్ వివంతాలో ఏర్పాటు చేసే ‘ఎక్స్టెన్సివ్ బఫెట్’కు వెళ్లవచ్చు. అలాగే హైటెక్స్‌లోని నోవాటెల్, ట్రైడెంట్, లెమన్ ట్రీ, బెస్ట్ వెస్టర్న్ అశోకా హోటల్స్‌లో కూడా స్పెషల్స్ టేస్ట్ చేసేయవచ్చు. హోలీ పార్టీ: పార్టీ మూడ్‌ను లోడ్స్ ఆఫ్ ఫన్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి సోమాజిగూడ పార్క్ హోటల్లోని ఆక్వా సరికొత్త థీమ్ పార్టీ ‘పిటార్స్ హోలీ హైదరాబాద్ 2015’ అరేంజ్ చేస్తోంది. ఆర్గానిక్ కలర్స్‌తో రంగులతో ఆడేసుకొని... డీజే మ్యూజిక్కు డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టేసి... ఆపై రెయిన్ డ్యాన్సులతో తడిసి ముద్దయ్యి... ఓ టేస్టీ ఫుడ్‌తో సెలబ్రేట్ చేసుకొనే చాన్స్ ఇది. సో... గెట్ రెడీ ఫర్ కలర్‌ఫుల్ ఈవెంట్! - వీఎస్