breaking news
swarna temple
-
స్వర్ణ దేవాలయంలో కలకలం
అమృత్సర్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టిచంపారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 30 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలున్న బంగారు గ్రిల్స్‌పై నుంచి దూకి నిషిద్ధ పూజా మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని, గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) టాస్క్‌ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకుని ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న కొందరు ఆ అగంతకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. మృతుని వివరాలు, ఇంకెవరైనా అతడితోపాటు ఉన్నారా? తదితర విషయాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ భందాల్ చెప్పారు. -
కొండవీడులో ‘ఇస్కాన్’ స్వర్ణ దేవాలయం
* 81 ఎకరాలు కేటాయింపు * దసరా రోజు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతికి సమీపంలోని కొండవీడులో శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయం నిర్మించాలని తలపెట్టిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్)కు రాష్ట్ర ప్రభుత్వం 81.03 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు ఇస్కాన్‌కు లీజుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరానికి రూ.లక్ష చొప్పున లీజుగా నిర్ణయించింది. రూ.200 కోట్ల వ్యయంతో ఐదు దశల్లో శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తామని ఇస్కాన్ దేవాలయాల దక్షణ భారతదేశ విభాగం అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ బుధవారం ప్రకటిం చిన విషయం విదితమే. ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ నిర్మాణానికి దసరా రోజున ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో హంస వాహనంపై శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 16.88 ఎకరాల భూమిని ఇస్కాన్‌కు అప్పగించింది. రెండో దశలో 22.94 ఎకరాల్లో రామలింగేశ్వర ఆలయం, గోవు విశ్వవిద్యాలయం, గోశాలను నిర్మిస్తారు. మూడో దశలో 18.68 ఎకరాల్లో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తి వేదాంత ఎడ్యుకేషనల్ సెంటర్, వేదిక్ కళాశాలను నిర్మిస్తారు. నాలుగో దశలో 18.48 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం, భక్తి వేదాం త ఆసుపత్రి, వృద్ధాశ్రమం, అంతర్జాతీయ పాఠశాల, అనాథాశ్రమాలను నిర్మించనున్నారు. ఐదో దశలో వెన్నముద్దల వేణుగోపాలస్వామి ఆలయం, భోజనశాలలు, అతిథి గృహాలను నిర్మిస్తారు.