breaking news
swarna mukhi river
-
స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
-
సై 'ఖతం'
కాసులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా టెండర్ల వాయిదాతో రెచ్చిపోతున్న వ్యాపారులు ప్రతి రోజూ వందలాటి కాంట్రాక్టర్ల తరలింపు చేష్టలుడిగి చూస్తున్న అధికారులు వాకాడు: మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. ఇటీవల వచ్చిన వరదలకు స్వర్ణముఖినది పొర్లుకట్టలకు గండ్లు పడి వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఇదే అదునుగా భావించిన సిలికా వ్యాపారులు ఇసుకను రహస్యంగా డంప్ చేసి చెన్నై, కర్నాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే పరిమితికి మించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఎకరాలో రూ.4 నుంచి రూ.5 లక్షలు వరకు ఆదాయం గడిస్తున్నారు. క్యూబిక్ మీటర్ రూ.50 చొప్పున రుసుము చెల్లించి ఇసుకను తొలగించుకోవచ్చునని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన ఇసుక అక్రమ వ్యాపారులు అధికారపార్టీ నేతల అండతో అక్రమంగా ఇసుకను తరలిస్తూ కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు. అంతేగా స్వర్ణముఖి పొర్లు కట్టల నుంచిఎక్కువ శాతం తరలిస్తున్నారు. కలిసొచ్చిన టెండర్ల వాయిదా: ప్రస్తుతం ఇసుక టెండర్లు కూడా వాయిదా పడటంతో గంగన్నపాళెం, వాలమేడు, జెమిన్ కొత్తపాళెం, పామంజి ప్రాంత పొలాల్లోని ఇసుకను తెచ్చి డంప్ చేస్తూ రాత్రి పూట స్వర్ణముఖినదిలోని ఇసుకను కూడా అక్రమంగా తోడి అందులో కలుపుకుని తరలిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు: రెవెన్యూ అధికారులు మాత్రం వీఆర్వో స్థాయి నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు, పోలీసులు కూడా దర్జాగా మామూళ్లు తీసుకుని అక్రమ దారులను పక్కదారిన వదిలేస్తున్నారు. ఇటీవల వాకాడు తహశీల్దార్ కొత్తగా రావడంతో రెవెన్యూ సిబ్బంది ఆమె దృష్టికి తీసుకురాకుండానే తహశీల్దార్ పేరు చెప్పి మామూళ్లు దిగమించారు. భూమి పొరల్లో ఉన్న ఇసుకను తోడేయడంతో భవిష్యత్లో భూ గర్భజలాలు అడుగంటి పోయే ప్రమాదముందని భూగర్భజలాల శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి లోతుగా విచారణ జరిపితే అవినీతి పరులు గుట్టు రట్టువుతుందని ప్రజలు అంటున్నారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు: గంగన్నపాళెం, వాలమేడు గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణాపై మంగళవారం నెల్లూరు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని వాకాడు పోలీస్ సేషన్లో ఉంచారు. పెద్ద ఎత్తున ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలింపు విషయంలో రెవెన్యూ,పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఫలితంగానే వాకాడు నుంచి రాత్రి పూట చెన్నై కర్నాటకకే కాకుండా నాయుడుపేట, గూడూరు, తడ, ఆరంబాకం, సూళ్ళూరుపేటల పట్టణాలలోని పలు పరిశ్రమలకు ఇసుక తరలుతోంది.