breaking news
Swami Naidu
-
చిరంజీవి ఇంటికి భారీగా అభిమానులు
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులను మొహరించారు. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపుఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు నాయకత్వంలో మెగా అభిమానులు చిరు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. చిరంజీవి ఇంటిని ముట్టిడించేందుకు వస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతామని స్వామినాయుడు అన్నారు. మెగాస్టార్ ఇంటిని ముట్టడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేరని, సినిమాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయనపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా ఊరుకోమని హెచ్చరించారు. చిరంజీవి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గట్టిగా బుద్ధిచెబుతామన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికితే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రోద్బలంతోనే చిరు ఇంటి ముట్టిడికి సిద్ధమయ్యారా అని అమరావతి జేఏసీని ప్రశ్నించారు. కాగా, చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. (చదవండి: క్లారిటీ ఇచ్చిన అమరావతి జేఏసీ) -
అప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్
వర్జీనియా : మెగాస్టార్ చిరంజీవి 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని అమెరికాలో ఆప్తా ఆధ్వర్యంలో చిరు అభిమానుల సహాయంతో మెగా రక్తదాన కార్యక్రమానికి కార్యచరణ సిద్ధం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె పిలుపునిచ్చారు. వర్జీనియాలోని స్టెర్లింగ్లో ఇనోవా హాస్పిటల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు రక్త దానం చేశారు. ఈ వేడుకలను అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు సేవలను ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ ఏజే కొనియాడారు. ఈ కార్యక్రమానికి 75 మందికి పైగా మహిళలు, చిన్నారులు హాజరయ్యారు.