breaking news
swacha Bharat Abhiyan scheme
-
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రగామిగా నిలపండి
పెద్దపల్లిఅర్బన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేం దుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. పెద్దపల్లి మండలం బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్‌పై ప్రత్యేక అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, వీఓలు, సం బంధిత సిబ్బందికి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 208 గ్రామపంచాయతీలకు అదనంగా మరో 65 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయన్నారు. గురువారం నుంచి ప్రత్యే క అధికారుల పాలన ప్రారంభమవుతుందని, ఇందుకోసం అవసరమైన ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రామపంచాయతీలలో సేవలను పారదర్శకంగా అందించేందుకు భవనాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పంచాయతీలలో పండుగ వాతావరణం క ల్పించేలా ప్రజలతో మమేకమై సేవలందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ స్వచ్ఛత వైపు అడుగులు వేయించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారుల ని రంతర కృషి ఫలితంగా ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మించి ఏడాది క్రితమే ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారని, దీనిని సుస్థిర పరిచే దిశగా ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లాలో స్వచ్ఛత రథ్ ద్వారా ప్రతీ గ్రామంలో పారిశుధ్యం, మరుగుదొడ్డి ఉపయోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. ఆగస్టు 15 వరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందాలు దేశవ్యాప్తంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకున్న 118 జిల్లాల్లో పర్యటించి, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథ కం కింద చేసిన పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దీనికి గ్రామ ప్రత్యేక అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. 118 ఓడీఎఫ్ జిల్లాల్లో పెద్దపల్లిని ప్రథమ స్థానంలో ఉంచేలా పని చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎస్ఎస్జీ యాప్‌లో సమాధానాలు జిల్లాలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్ఎస్జీ 18 అనే యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి, జిల్లా స్వచ్ఛతకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు అందించాలన్నారు. కేంద్ర బృందం గ్రామాల్లో పర్యటించినపుడు గ్రామపంచాయతీ కార్యదర్శులను, ప్రత్యేక అధికారులను, అంగన్వాడీ టీచర్లను, ఏఎన్ఎంలను స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో భాగంగా జిల్లాలో చేసిన కార్యక్రమాలపై వివరాలు అడుగుతారని, సమర్ధవంతంగా సమాధానం ఇవ్వాలన్నారు. స్వచ్ఛతకు పెద్దపీట జిల్లాలో ట్రీగరింగ్, అవగాహన కార్యక్రమాలు, ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలపై కేంద్ర బృందం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున వాటిపై సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లోని పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, స్వశక్తి భవనాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి, అక్కడ ఉన్న మరుగుదొడ్లను, నీటి లభ్యత, మరుగుదొడ్ల వాడకాన్ని పరిశీలించి, 30 మార్కులు కేటాయిస్తారని పేర్కొన్నారు. అవసరమైన చోట తగిన సూచనలు, దిద్దుబాటు చర్యలు చేయాలన్నారు. చెత్తబుట్టలను కొనుగోలు చేసి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మహిళలు నెలసరి సమయంలో న్యాప్కిన్లు ఉపయోగించేలా చూడాలని సూచించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో చేపట్టనున్నందున శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని, క్యాంపు వివరాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలన్నారు. కంటి వెలుగు పథకంలో భాగంగా తగిన వైద్యులు, సిబ్బంది కళ్లద్దాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నరేగా నిధులను ఉపయోగించి స్మశాన వాటికలను నిర్మించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో జేసీ వనజాదేవి, ఇన్చార్జి డీఆర్డీవో ప్రేమ్‌కుమార్, డీపీవో సుదర్శన్, డీఎంహెచ్‌వో ప్రమోద్, అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
పీలారంలో స్వచ్ఛభారత్ రాష్ట్ర బృందం పర్యటన
అనంతగిరి: వికారాబాద్ మండలంలోని పీలారం గ్రామాన్ని రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్ పరిశీలన బృంద ప్రతినిధులు శ్రావ్య, శ్రీనివాస్, ప్రదీప్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని బృందం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి స్వచ్ఛ్ భారత్ లక్ష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతూ వేలాది గ్రామాలు ఓడీఎఫ్‌గా ప్రకటిస్తున్నాయని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో సైతం అన్ని గ్రామాలను త్వరలోనే ఓడీఎఫ్‌గా ప్రకటించే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రెండు గుంతలు తప్పకుండా తవ్వాలని సూచించారు. రెండు గుంతల మధ్య మీటర్ దూరం తప్పకుండా ఉండాలని ఆ దూరం వల్లనే ఎరోబిక్ చర్య జరిగి మలం ఎరువుగా మారుతుందని తెలిపారు. ప్రతీగుంతలో నాలుగు రింగులు వేయాలని సూచించారు. రింగుల మధ్య ఒక ఇంచు గ్యాప్ ఉండాలని, రెండు గుంతలకు జంక్షన్ బాక్స్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఒకదాన్ని మూసేసి రెండో దాన్ని ఓపెన్ ఉంచాలని సూచించారు. కుండీ ద్వారా మెయిన్ కనెక్షన్ జంక్షన్ బాక్స్‌కి ఇవ్వాలి. ఈ నిబంధనల మేరకే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఖచ్చితంగా చెప్పారు. ఈ క్రమంలో వారు నిర్మించుకున్న, నిర్మింపబడుతున్నా ఇంకా నిర్మాణం ప్రారంభంకాని లబ్ధిదారులతో మాట్లాడి అన్ని విషయాలను వారితో చర్చించారు. నెలరోజుల్లోనే 60 మరుగుదొడ్లను నిర్మించుకునుటకు కాకుండా ఇంకా దాదాపు వంద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నందుకు గ్రామస్తులను, సర్పంచ్ మండల బృందాన్ని ఎఫ్ఏ నర్సింలును అభినందించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు సర్పంచ్ ప్రభావతి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మి, ప్రతినిధి కిరణ్, ఏపీఓ శీను, ఏపీఎం లక్ష్మయ్య, టీఏ రవి, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, వీఓ అధ్యక్షురాలు బేగం, ఈసీ నవీన్ పాల్గొన్నారు. -
రూ.4.63 కోట్ల మిగులు బడ్జెట్‌కు ఆమోదం
దావణగెరె : దావణగెరె సిటీ కార్పొరేషన్‌కు వివిధ ఆదాయ వనరుల ద్వారా మొత్తం రూ.539.30 కోట్ల ఆదాయం లభించనుండగా, ఇందులో వివిధ అభివృద్ధి పనులకు రూ.532.57 కోట్లు ఖర్చు చేసి, రూ.4.63 కోట్లను మిగల్చాలని ఉద్దేశించినట్లు సిటీ కార్పొరేషన్ పన్నులు, ఆర్థిక స్థాయి సమితి అధ్యక్షుడు హెచ్.గురురాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన నగర శివార్లలోని సిటీ కార్పొరేషన్ సమగ్ర నీటి సరఫరా కేంద్రం వద్ద మేయర్ హెచ్‌బీ గోణెప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో 2016-17వ సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నగరంలోని మండక్కి భట్టి ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.35 కోట్లు, ఆస్పత్రి భవనాలు, ఆవరణలను మెరుగు పరిచేందుకు, ప్రజలకు కాలిబాటల నిర్మాణానికి, ఆధునిక బస్టాండ్ నిర్మాణాలకు, పాలికె కార్యాలయంలో డిజిటల్ గ్రంథాలయం ప్రారంభానికి రూ.55 కోట్లు, ప్రైవేట్ బస్టాండ్ల అభివృద్ధికి రూ.25 కోట్లు, వాణిజ్య సంకీర్ణం, వాహనాల పార్కింగ్‌కు రూ.25 కోట్లు, నగరంలో రవాణా వ్యవస్థ మెరుగుదలకు రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద రూ.21 లక్షలతో రెండు ప్రజా మరుగుదొడ్లు, 15 వేల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ఉద్దేశించినట్లు తెలిపారు. బడ్జెట్‌ను మరో కార్పొరేటర్ శివనహళ్లి రమేష్ స్వాగతించగా, ఎం.హాలేష్ ఆమోదించారు. సమావేశంలో సభ్యులతో పాటు కమిషనర్ నారాయణప్ప, స్థాయి సమితి అధ్యక్షులు బీ.లక్ష్మిదేవి వీరణ్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.