breaking news
SVIMS Medical College
-
చేయాల్సిందంతా చేసి నటనలా?
తిరుపతి అర్బన్ : ‘‘మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మించిన 300 పడకల గర్భిణీల భవనాలను స్విమ్స్‌కు కేటాయించే సమయంలో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మా ఆందోళనలు చూశాక నటనలు ప్రదర్శిస్తారా..? పేదల ప్రాణాలంటే లెక్కలేదా’’ అంటూ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ శాంతారామ్ను జూనియర్ డాక్టర్లు నిలదీశారు. దాంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ కాలేజీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 300 పడకల భవనాల సమస్యపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, రుయా-మెటర్నిటీ సూపరింటెండెంట్లతో నేరుగా చర్చించి స్విమ్స్‌కు అప్పగించే విధంగా నచ్చజెప్పే ప్రయత్నం కోసం డీఎంఈ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చి ఓ ప్రైవేటు హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా 300 పడకల భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్లు డాక్టర్ జీ.పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి నేతృత్వంలోని జూ.డాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విష్ణుభరద్వాజ్, డాక్టర్ సత్యవాణి ఆధ్వర్యంలో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 800 మంది రుయా నుంచి ప్రదర్శనగా మెడికల్ కాలేజీ సర్కిల్ వద్దకు చేరుకుని మానవ హారం నిర్వహించారు. అక్కడి నుంచి బ్యానర్లు, ప్ల కార్డులు చేతబట్టి రాష్ర్ట ప్రభుత్వానికి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆందోళనల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర నాయకులు హరినాథరెడ్డి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ నాయకులు మెటర్నిటీ ముందు గర్భిణీలతో కలసి మహాధర్నా నిర్వహించారు. సోమవారం కావడంతో రుయా, మెటర్నిటీల ఓపీ విభాగాలకు రోగుల తాకిడి వేలల్లో కనబడింది. నిరసనలు, ఆందోళనల కారణంగా గర్భిణీలు, రోగులు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్‌కు వచ్చిన డీఎంఈని ఆందోళనకారులు అడ్డుకుని ఘెరావ్ చేశారు. జూ.డాల నాయకులు డీఎంఈని నిలదీసి తమకు చెందిన హాస్పిటల్ భవనాలను స్విమ్స్లాంటి కార్పొరేట్ సంస్థకు ఇవ్వడం సరైంది కాదన్నారు. అందుకు డీఎంఈ బదులిస్తూ స్విమ్స్‌కు ఇచ్చేశాక మీరెందుకు ఆందోళనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో జూ.డాలు, హౌస్ సర్జన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏది ఏమైనా 300 పడకల భవనాలను మెటర్నిటీకే చెందేలా జీవోలో మార్పులు చేయాలని, లేకుంటే పేద ప్రజలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
స్విమ్స్ మెడికల్ కళాశాల అడ్మిషన్లపై మల్లగుల్లాలు
తిరుపతి: స్విమ్స్‌కు అనుబంధంగా ఏర్పాటవుతున్న శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 150 సీట్ల సామర్ధ్యంతో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతితో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభించాలని స్విమ్స్ అధికారులు నిర్ణయించారు. మెడికల్ కళాశాల కోసం సుమారు రూ.70 కోట్లతో భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యా యి. అయితే మిగతా పనులు పూర్తి కావడానికి నెలన్న ర రోజులు పట్టే అవకాశం ఉండడంతో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలా వద్దా అనే ఆలోచనలో స్విమ్స్ అధికారులు పడ్డారు. హడావిడిగా అడ్మిషన్లు కానిచ్చి ఆ తర్వాత విమర్శలు ఎదుర్కోవడం ఎందుకని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్వీ మెడికల్ కళాశాల కు అనుబంధంగా మంజూరైన 300 పడ కల ఆస్పత్రిని పద్మావతి మెడికల్ కళాశాలకు అనుబంధం చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 78 వివాదాస్పదంగా మారింది. మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తూ రాయలసీమలోనే అతి పెద్దదైన తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి సేవల విస్తృతిలో భాగంగా ఏర్పాటు చేసిన 300 పడకల ఆస్పత్రిని స్వి మ్స్ మెడికల్ కళాశాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ వారు ఉద్యమబాట పట్టారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటే అనుబంధంగా జనరల్ ఆస్పత్రి కలిగి ఉండాలని ఎంసీఐ నిబంధన ఉంది. 300 పడకల ఆస్పత్రి కోసం ఎస్వీ మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నా యి. ఈ నేపథ్యంలో పద్మావతి మెడికల్ కళాశాలకు అనుబంధంగా మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నపుడు మాతా, శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 300 పడకల ఆస్పత్రిని ఆ కళాశాలకు అప్పగించడమే సబబుగా ఉంటుందన్న వాదన వినిపిస్తోం ది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అడ్మిషన్ల జోలికి పోకుండా అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించాలనే యోచనలో కూడా స్విమ్స్ అధికారులు ఉన్నట్టు తెలిసింది.