breaking news
SUZUKI MOTORCYCLES
-
ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్‌గా ఆ బైక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' (Suzuki Motorcycle) ఇటీవల ఉత్పత్తిలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్‌లోని ఖేర్కి ధౌలా ప్లాంట్ నుండి 7 మిలియన్ల యూనిట్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ 7 మిలియన్ యూనిట్‌గా ఎల్లో కలర్ ఫినిషింగ్ పొందిన 'సుజుకి వి-స్ట్రామ్ ఎస్ఎక్స్' విడుదల చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన అపూర్వమైన విజయం అనే చెప్పాలి. ఫిబ్రవరి 2006లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాలను ప్రారంభించిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 9.38 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్, యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్మాన్ స్ట్రీట్, బర్గ్మాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి ద్విచక్ర వాహనాలను దేశీయ విఫణిలో తయారు చేస్తోంది. అంతే కాకుండా పెద్ద-బైక్ పోర్ట్‌ఫోలియోలో వి- స్ట్రామ్ 650XT, కటన, హయబుసా మోడల్స్ ఉత్పత్తి చేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. -
సుజుకి 'జిక్సర్' ఆ దేశానికి వెళ్తోంది!
ఇండియాకు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ యూనిట్ సుజుకి మోటార్ సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్, స్థానికంగా తయారుచేసిన జిక్సర్ బైక్‌ను తన స్వదేశానికి తరలిస్తోంది. భారత మార్కెట్లో తయారుచేసిన ఈ బైక్‌ను జపాన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నట్టు సుజుకి మోటార్ సైకిల్ వెల్లడించింది. తమ మొదటి కన్సైన్మెంట్(ఒప్పందం) కింద ఇప్పటికే మేడిన్ ఇండియా జిక్సర్ మోటార్‌సైకిళ్లను ఇండియా నుంచి జపనీస్ మార్కెట్‌కు తరలించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. లాటిన్ అమెరికా లాంటి ఇతర సరిహద్దు దేశాలకు జిక్సర్ బైక్ ను కంపెనీ ఎగుమతి చేస్తుందని సుజుకి మోటార్‌సైకిల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా తెలిపారు. జపనీస్ వినియోగదారుల నుంచి కూడా జిక్సర్కు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 155 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్‌లు దీనిలో ఉన్నాయి. జపాన్‌కు ఎగుమతిచేస్తున్న జిక్సర్‌లో ప్యూయల్ ఇంజెక్షన్, రియర్ డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.