breaking news
surya 24
-
నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది
‘‘నేను యాక్టర్ కావాలనుకున్నప్పుడు సూర్య అన్నని కలవాలనుకునేవాణ్ణి. ‘గజినీ’ సినిమా చూసి.. ఆ బాడీ ఏంటి? డ్యాన్స్ ఏంటి? నటన ఏంటి? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయో తెలుసుకునేందుకు ఆయన్ని కలవాలని చాలాసార్లు అనిపించేది. కలవాలనే కోరిక ఉన్నా కలవలేకపోయాను. నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేర్చిన ఈ మూమెంట్, ఈ ‘రెట్రో’ సినిమా నా జీవితంలో మరపురాని అనుభూతి’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నాను.. మేమంతా మీకు అండగా ఉంటాం. నా లైఫ్‌లో ఒక సినిమాటిక్ మెమొరీ అంటే ‘చంచల...’ (సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా) పాట వచ్చినప్పుడు... ఆ రోజు నాకు కలిగిన అనుభూతిని ఈరోజు వరకు మరచిపోలేదు. ఇప్పటికీ ఆ పాటని వింటూ నా బాల్యంలోకి వెళుతుంటాను. నాకు ‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక కశ్మీర్ మనదే.. కశ్మీరీయులు మనవారే. ఇండియా.. పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన పనే లేదు. ఈ దాడులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి వారి ప్రభుత్వంపై దాడి చేస్తారు. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ–‘‘కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలోప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకుశాంతి చేకూరాలి. ఇలాంటి సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగకూడదు. ‘రెట్రో’లో లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. నాగవంశీగారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీగారి నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్–3’ కూడా విజయం సాధించాలి. విజయ్ ‘కింగ్ డమ్’ సినిమా కూడా సక్సెస్ కావాలి. ‘అగరం ఫౌండేషన్’ గురించి విజయ్ మాట్లాడాడు.. అయితే చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా ‘అగరం ఫౌండేషన్’కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు’’ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ–‘‘రెట్రో’ సినిమాని తెలుగులో పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన సూర్య సర్కి థ్యాంక్స్. ఈ సినిమాతో మీకు ఇక్కడ బ్లాక్ బస్టర్ ఇస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘రెట్రో’ చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం, డైరెక్టర్ వెంకీ అట్లూరి, పాటల రచయిత కాసర్ల శ్యాం, నటుడు కరుణాకరన్ మాట్లాడారు. -
అందుకు కారణం హీరోలే
నటి సమంత లైఫ్ స్టైల్ ఎలాంటిదైనా,ఆమె మాటల్లో వాస్తవాలు ఉట్టి పడతాయి.లేని గొప్పలను తనకు ఆపాదించుకోదీ చెన్నై చిన్నది.నటినవ్వాలన్న ఆసక్తితో తోలి రోజుల్లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని నిర్భయంగా చెప్పే సమంత ఇప్పటి తన ఉన్నతికి తన కృషి,శ్రమ అని చెప్పుకున్న దాఖలాలు లేవు. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ కథానాయికల పట్టికలో చేరిన ఈ చెన్నై చందం తమిళంలో ప్రస్తుతం విజయ్‌తో తెరి, సూర్య సరసన 24 చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లోనూ తన క్రేజ్‌ను కొనసాగించుకుంటున్న సమంత ఇటీవల ఒక సాహసాన్ని చేసి తన అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు.100 కిలోల వెయిట్‌ను ఏకంగా మూడుమార్లు పైకి లేపి దీన్ని వీడియో తీసి సోషల్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేశారు. 50 కిలోల బరువు కలిగిన సమంత 100 కిలోల బరువును అవలీలగా ఎత్తడంతో అభిమానులు నివ్వెరపోయారు. దీని గురించి సమంతను అడగ్గా స్త్రీలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అంటూ తనదైన మందహాసంతో బదులిచ్చారు. ఈ బ్యూటీ మాట్లాడుతూ తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువతినన్నారు. జీవితంలో ఇంత స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. అయితే ఈ ఉన్నతికి కచ్చితంగా తాను కారణం కాదని అన్నారు. అందుకు కారణం తనతో నటించిన కథానాయకులేనని పేర్కొన్నారు. తమిళం,తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలు తనకు లభించాయన్నారు.ఆ చిత్రాలు విజయాలు సాధించడంతో అభిమానులకు సులభంగా చేరువయ్యానన్నారు.అదే విధంగా తనతో చిత్రాలు చేసిన దర్శకులు తన ఉన్నతికి కారణం అయ్యారని అని అన్నారు.ఇకపై కూడా మంచి కథా పాత్రలు చేస్తూ తన స్థాయిని కాపాడుకోవడానికి పోరాడతానని పేర్కొన్నారు.ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాపైనే నిమగ్నం చేస్తున్నట్లు ముద్దుగుమ్మ సమంత స్పష్టం చేశారు.