breaking news
suraiah
-
కొంగలను పట్టుకునేందుకు వెళ్లి..
మార్టూరు మండలం గన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంగలను పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొక్కిలి కుంటలో పడి చనిపోయారు. మృతులు ప్రభుదాస్(25), సూరయ్య(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెరల్స్ బాధితుడి ఆత్మహత్య
దేవీపట్నం: భవిష్యత్ అవసరాల కోసం డబ్బు దాచుకున్న వ్యక్తి ఆ డబ్బు సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తపల్లి సూరయ్య(70) పెరల్స్ సంస్థలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఏజెంట్‌ను కోరాడు. దానికి ఏజెంట్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరయ్య కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.