breaking news
suplementary exams
-
మరోసారి వాయిదాపడ్డ ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంటర్ బోర్డు మరోసారి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 7నుంచి 14వరకు జరగనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు రీ వాల్యువేషన్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష టైంటేబుల్ వివరాలు ఇలా.. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
నల్లగొండ రూరల్: నల్లగొండ జిల్లాలోని రామన్నపేట బస్సు ప్రమాదంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం జరగాల్సిన పరీక్షలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె.అంజిరెడ్డి బుధవారం తెలిపారు.