breaking news
sunshine vitamin D
-
Health Tips: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక.. నరకం కనిపిస్తుంది!
శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ తగ్గినా.. అనారోగ్యాలు దాడి చేసేందుకు సిద్ధమవుతాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్–డి లోపిస్తే.. నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డి విటమిన్ లోపం వల్ల తలెత్తే సమస్యలు తెలుసుకుందాం. ►విటమిన్–డి అనేది కొవ్వులో కరిగే ముఖ్యమైన విటమిన్. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. లేదా శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ►విటమిన్–డి లోపం.. శరీర కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ►కండరాల నొప్పి, నీరసం, ఎముక సాంద్రత, పిల్లల్లో రికెట్స్ సమస్యలు ఏర్పడతాయి. ►ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్–డి అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం. ►కొన్ని అధ్యయనాల్లో విటమిన్–డి అధిక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంగా... చురుగ్గా ఉన్నట్లు వెల్లడి అయింది. విటమిన్ డి ఎందుకు అవసరం? ►విటమిన్–డి ఎముకల జీవక్రియకు అవసరమైన హార్మోన్ ఉత్పత్తికి, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం. ►రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ►శరీర కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ►చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ‘సన్‌షైన్ విటమిన్’ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. ►శీతాకాలంలో శరీరానికి విటమిన్ ఈ లభించాలంటే కనీసం 10–30 నిమిషాలు సూర్యరశ్మి తగలాలి. లోపిస్తే ఏమవుతుంది? ►విటమిన్–డి లోపిస్తే.. పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ►పిల్లల్లో ఎముకల వృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ►పెద్దవారిలో ‘ఆస్టియోమలాసియా’ ఏర్పడుతుంది. ►కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి–విటమిన్ లోపాన్ని ఎదుర్కొంటారు. ►ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడుతుంది. చదవండి👉🏾 Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇదే.. ఇవి తింటే మేలు! -
ఎగ్‌స్ట్రార్డిన రీ!
నేడు వరల్డ్ ఎగ్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.2 ట్రిలియన్ గుడ్లను తింటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే గుడ్లలో 40 శాతం గుడ్లను చైనాలో వినియోగిస్తున్నారు. ముప్పై నిమిషాల్లో 427 ఆమ్లెట్లు వేయడం ద్వారా హోవర్డ్ హెల్మేర్ అనే వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు. జార్జ్ కెన్నడి నటించిన ‘కూల్ హ్యాండ్ లూక్’ (1967) చిత్రంలోని ‘నోబడీ కెన్ ఈట్ 50 ఎగ్స్’ డైలాగ్ అప్పట్లో బాగా పేలింది. కామన్వెల్త్ ఆఫ్ కెంటకీలో ‘వరల్డ్ హార్డ్-బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాంపియన్షిప్’ పోటీలు జరుగుతుంటాయి. ప్రసిద్ధ చిత్రకారుడు సాల్వడర్ డాలీకి గుడ్లు అంటే ప్రత్యేక అభిమానం. ఆయన పెయింటింగ్‌లో అవి కనిపిస్తాయి. స్పెయిన్‌లోని ‘డాలీ మ్యూజియం’లో రకరకాల గుడ్లు ఉన్నాయి. పాప్యులర్ గేమ్స్‌లో ఎన్నో ఎగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఎగ్ హంట్, ఎగ్ టాస్, ఎగ్ రోలింగ్, ఎగ్ ట్యాపింగ్...మొదలైనవి. ప్రాచీన రోమన్లు తొలిసారిగా ఆమ్లెట్ వేశారు. తేనెతో కలిపి తినేవారు. దీన్ని ఒవెమెల్(గుడ్లు మరియు తేనె) అని పిలిచేవారు. సన్‌షైన్ విటమిన్‌గా ‘విటమిన్ డి’ లభించేది గుడ్డులోనే!