టీఆర్ఎస్ నుంచి సున్నం సత్యం సస్పెన్షన్
ఇబ్రహీంపట్నం : మండలంలోని వేములకుర్తి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు సున్నం సత్యంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడినందును ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వివరించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు జంగస్వామి, అమ్ముల లక్ష్మణ్, గొల్ల నరేందర్ తదితరులు ఉన్నారు.