త్వరలో కాకినాడ ఈఐడీ ప్యారీ షుగర్ రిఫైనరీ ప్రారంభం
చెన్నై: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలోని ఈఐడీ ప్యారీ(ఇండియా) షుగర్ రిఫైనరీ ప్లాంట్లో కోల్-ఫైర్డ్ బాయిలర్లను ఏర్పాటు చేస్తున్నామని మురుగప్ప గ్రూప్ తెలిపింది. ఈ బాయిలర్ల ఏర్పాటు తర్వాత ఈ రిఫైనరీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల టన్నులు ప్రాసెస్ చేయగలమని అంచనాలున్నాయని మురుగప్ప గ్రూప్ డెరైక్టర్ (ఫైనాన్స్) ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. కాగా 201516లో తమ గ్రూప్... కంపెనీల ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, టెక్నాలజీలపై రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని గ్రూప్ వైస్ చైర్మన్ ఎం.ఎం. మురుగప్పన్ చెప్పారు. వీటిల్లో సైకిళ్లు తయారు చేసే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా కోసం రూ.90 కోట్లు కేటాయించామని వివరించారు.