breaking news
sudarshanreddy
-
ఎన్నికల స్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం
బంజారాహిల్స్: నిజాం పాలనలో జరిగిన దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని కొందరు కుల, మతాల మధ్య జరిగినట్టు చిత్రీకరిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం ఎన్నికల స్వామ్యంగా మారడంతోనే అది బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్’ఆధ్వర్యంలో ‘వీర తెలంగాణ రైతాంగ సాయుధపోరాట 74వ వార్షికో త్సవాలను ఆయన ప్రారంభించారు. తొలుత రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జెండాను తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థాన ప్రజలు 1948 తర్వాత ప్రా ణవాయువులు పీలుస్తున్నారంటే నాటి కమ్యూని స్టులు చేసిన పోరాటం, త్యాగాల వల్లేనన్నారు. ఈ త్యాగాల పునాదులపై నిర్మితమైన చరిత్రను, కొందరు వ్యాపారం చేసుకుంటూ నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ విమోచన పేరిట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో సభ నిర్వహించినంతనే చరిత్ర మారబోదని, తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎర్రజెండా, తెలంగాణ ప్రజలే వారసులని సుర వరం అన్నారు. వల్లబ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ రాజ్యాన్ని విముక్తి చేశారంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. రావి నారాయ ణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మోహి ముద్దీన్, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మను ఎర్రజెండా నుంచి వేరు చేయవద్దన్నారు. సమా వేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారా యణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, అమర వీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం
సాక్షి , హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఈ మేరకు సంస్థ పాలక మండలి నిర్ణయించిందని తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పౌరసరఫరాల శాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వివరించింది. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు సంస్థల అవసరాల మేరకు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని బోర్డు తీర్మానించింది. కొత్తగా ఎన్ఫోర్స్మెంట్, ఐటీ, ఫైనాన్స, టెక్నికల్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థలో ఆర్థిక సలహాదారుడి నియామకానికి ఆమోదం తెలిపింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి పాలకమండలి సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ సీవీ ఆనంద్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన ట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదాముల తనిఖీ: గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో పౌరసరఫరాల సంస్థ గోదామును ఆయన తనిఖీ చేశారు. ప్రజాపంపిణీని మరింత సమర్థంగా నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కందిపప్పును రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు విక్రరుుంచేందుకు కేంద్రం నుంచి కందులు కొనుగోలు చేసి మిల్లింగ్ చేరుుంచినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ గోదాములో 167 టన్నుల పప్పు నిల్వ ఉందని తెలిపారు.