breaking news
Subway construction
-
5 గంటల్లోనే సబ్వే నిర్మాణం
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): వాల్తేర్ డివిజన్ రికార్డు సమయంలో మరో లిమిటెడ్ హైట్ సబ్వే (ఎల్హెచ్ఎస్) నిర్మాణం పూర్తి చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి చెప్పారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ విజయనగరం–శ్రీకాకుళం రోడ్డు మెయిన్ లైన్లో సింగిల్ బ్లాక్, పవర్ బ్లాక్ తీసుకుని, పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికే ఎల్హెచ్ఎస్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. కోరుకొండ–విజయనగరం, దూసి–పొందూరు సెక్షన్ల మధ్య కట్ అండ్ కవర్ పద్ధతిలో ఈ లిమిటెడ్ హైట్ సబ్‌వేల నిర్మాణం 5 గంటల్లోనే పూర్తి చేసినట్లు వివరించారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కో ఆర్డినేషన్) ప్రదీప్‌యాదవ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (ఈస్ట్) రాజీవ్‌కుమార్‌లు ఈ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయించినట్లు తెలిపారు. -
వచ్చే నెల నుంచి అందుబాటులో ఐటీఓ మెట్రో
{పయోగాత్మక పరుగు విజయవంతం స్టేషన్ లోపలా, వెలుపలా ఫినిషింగ్ పనులు ఆఖరిదశకు చేరుకున్న సబ్‌వేల నిర్మాణం డెడ్‌లైన్‌కంటే తొమ్మిది నెలల ముందే సేవలు న్యూఢిల్లీ : ఐటీఓ వరకు మెట్రో సదుపాయం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఈ సదుపాయం వచ్చే నెలాఖరునాటికల్లా అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక పరుగు విజయవంతమైందని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్ లోపలా వెలుపలా ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. స్టేషన్‌కు రాకపోకలు సాగించడంతోపాటు రోడ్డు దాటడానికి నిర్మించిన సబ్వేను సాధారణ ప్రజలకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా రెండు సబ్‌వేల నిర్మాణ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. భద్రతా తనిఖీకోసం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీకి వచ్చే వారం లాంఛనంగా లేఖ రాయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. మార్చి మూడోవారం ఐటీఓ మెట్రో స్టేషన్ ద్వారాలు సామాన్యుల కోసం తెరచుకుంటాయని వారు అంటున్నారు. మెట్రో స్టేషన్లో ఎలక్ట్రానికల్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ఫైర్ స్టేఫీ, ట్రాక్ సిస్టం, ఓహెచ్‌ఈకి సంబంధించిన పనులు పూర్తయ్యాయని, వాటికి సంబంధించిన పరీక్షలు కూడా విజయంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. మండీ హౌజ్ నుంచి ఐటీఓ మెట్రో స్టేషన్ వరకు మెట్రో ట్రయల్ రన్ గత ఏడాది డిసెంబర్ 18న మొదలైంది. సాధారణంగా నెల రోజుల ట్రయల్ తరువాత సేఫ్టీ కమిషనర్‌తో తనిఖీ జరిపించి మెట్రో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అయితే మండీహౌజ్, బదర్ పూర్ మధ్య మెట్రో రైలు రోజంతా నడుస్తున్నందువల్ల ఐటీఓ స్టేషన్ వరకు ట్రయల్‌ను రాత్రి పూట మాత్రమే నిర్వహిస్తున్నారు. అందువల్ల ఐటీఓ స్టేషన్ వరకు ట్రయల్ రన్‌ను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టిందని అధికారులు అంటున్నారు. డాల్ మ్యూజియం, డీడీయూమార్గ్పై నిర్మించిన నాలుగు ఎంట్రీ గేట్లు, సబ్‌వేలను స్టేషన్‌తోపాటు తెరవనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.స్టేషన్ కారిడార్‌లో ఐటీఓ పరిసరాల చరిత్రను తెలియజెప్పే పెయింటింగ్‌లను ఉంచాలని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) యోచిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ స్టేషన్ నిర్మాణ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది డీఎంఆర్సీ లక్ష్యం. అయితే ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో పెట్టుకుని దీనిని తొమ్మిది నెలల మేర ముందుకు జరిపారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 22 వేల మంది ప్రయాణిస్తారని అంచనా.