breaking news
Sub-Contract
-
ఇష్టారాజ్యంగా గిడ్డంగి పనులు
బోథ్ : రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నచందంగా రూ. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ప్రభుత్వ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక రైతు సహకారం సంఘం గిడ్డంగి నిర్మాణానికి రూ.13.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులను సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షిస్తోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు మూడో వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి నేరడిగొండ మండలంలో ఓ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు అడ్డు చెప్పరనే ధీమాతో పనులు సాగిస్తున్నాడు. నాసిరకం ఇసుక వాడకం దశాబ్దాలపాటు నిలవాల్సిన పనులకు మేలైన ఇసుక వాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఇందుకు అవసరమైన ఇసుకను నిజామాబాద్ జిల్లా పెద్దవాగు నుంచి, మహారాష్ట్ర నుంచి అనుమతితో వచ్చిన ఇసుకనుగాని వాడేందుకు అందుకు అవసరమైన దూరాన్ని, ధరను నిర్ణయించారు. కాని సబ్‌కాంట్రాక్టర్ ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ నుంచి తెప్పించిన నాసిరకం మట్టితో కూడిన ఇసుక వాడి పనులు సాగిస్తున్నాడు. కనిపించని వైబ్రేటర్ రూ. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న పనుల్లో సీసీ భీంలో అన్ని వైపులా చేరుకోవడానికి వైబ్రేటర్‌ను ఉపయోగిస్తారు. వైబ్రేటర్ ఉపయోగించడంతో దాదాపు 25 శాతం మేర కంకర, ఇసుక, సిమెంటు అధికంగా వినియోగం అవుతుంది. పనుల్లో వాడే వస్తువులు విలువను తగ్గించుకోవడానికి, పనుల్లో వైబ్రేటర్‌ను వినియోగించడంలేదు. అనుభవం లేని వ్యక్తులతో నిర్మాణం పనులను తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు పనులు చేపడుతున్నారు. నైపుణ్యం గల కార్మికులను వినియోగించకుండా తూతుమంత్రంగా పనులు చేపడుతున్నారు. పుటింగ్లను నుంచి ప్లింత్ భీంల వరకు జరిగిన పనుల్లో వంకరగా చేసిన పనులు వారి పని తనానికి అద్దంపడుతున్నాయి. పైకి కనిపించే పనులు ఇలా ఉంటే లోపల చేపట్టిన కర్టెన్‌వాల్, ఇతర పనులు ఏవిధంగా చేపట్టారో చెప్పనవసరం లేదు. తీసివేయని మట్టి ఇక్కడి నల్లరేగడి నేలకు అనుకూలంగా అధికారులు పనుల్లో నాణ్యత లోపించకుండా ప్రతిపాదనలు పంపుతారు. పునాదుల్లో తీసిన మట్టిని పూర్తిగా తొలగించి, అందుబాటులోని గ్రావెల్‌తో పునాదులను నింపుతారు. అలాంటిది పనుల్లో ఇప్పటివరకు తీసిన మట్టిని పునాదుల్లోనే వేసేశారు. ఇప్పటికీ మట్టిని తొలగించకుండా ప్లోరింగ్‌లో కూడా అదే మట్టిని ఉపయోగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ఆవేదన నాసిరకం పనులపై సంఘానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడతామని అధికారంలో కొచ్చిన నేతలు ఇలాంటి పనులు చేపట్టడం ఏమిటని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు నాణ్యతతో చేయించాలని కోరుతున్నారు. పనులు పరిశీలిస్తాం - ప్రభాకర్, డీఈఈ, సాంఘిక సంక్షేమశాఖ నాసిరకం పనుల విషయం నా దృష్టికి రాలేదు. ప్రస్తుతం బోథ్ మండలంలోనే ఐదు పనులు కొనసాగుతున్నాయి. అన్ని పనులను పర్యవేక్షించడం కష్టసాధ్యం అవుతుంది. గోదాం పనులను సోమవారం పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తా. అవసరమైతే కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేస్తా. -
మా పార్టీ అధికారం లో ఉంది
విజయనగరం ఆరోగ్యం: కాంగ్రెస్ పార్టీ దళారుల పార్టీ...దోపిడీ దొంగల పార్టీ అని విమర్శించిన టీడీపీ నేతలు తీరా అధికారంలోకి వచ్చాక.. గత పాలకులు అనుసరించిన విధానాలనే అవలంభిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు అధికారంలోకి రావడంతో గతంలో చెప్పిన నీతి సూత్రాలను మరిచిపోయి నాలుగు రాళ్లు వెనుకేసుకునే పనిలో పడ్డారు.అందుకు వివిధ శాఖల్లో ఆ దాయం వచ్చే కాంట్రాక్ట్‌లపై కన్నేస్తున్నారు. తాజాగా కేంద్రాస్పత్రి శానిటేషన్ సబ్ కాంట్రాక్ట్‌పై ఆ నేతల కన్ను పడింది. అనుకున్నదే తడువుగా ఆస్పత్రికి చెం దిన ఓ అధికారి ద్వారా శానిటేషన్ కాంట్రాక్టర్‌తో టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత రెండు రోజులు క్రితం మం తనాలు చేసినట్టు సమాచారం. ‘మా పార్టీ అధికారం లో ఉంది. మీకు బిల్లులు సకాలంలో చెల్లించాలంటే మా వాడికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని సదరు నేత... కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్టు భోగట్టా. దీంతో సదరు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. కాంగ్రెస్ పాలకులే ఆదర్శం గతంలో కూడా కేంద్రాస్పత్రిలో ఇదే అనవాయితీ నడిచేది. గతంలో హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు కేంద్రాస్పత్రిలో శానిటేషన్ చేసే కాంట్రాక్టు వచ్చింది. అయితే అప్పట్లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడికి సబ్ కాంట్రాక్టు ఇచ్చారు. అసలు కాంట్రా క్టర్ ఎప్పుడూ ఇక్కడ పనులు చేపట్టలేదు. మళ్లీ అదే అనావాయితీకి టీడీపీ తెరతీసింది. సబ్ కాంట్రాక్టు దక్కించుకు నేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు నష్టం కేంద్రాస్పత్రిలో శానిటేషన్ కాంట్రాక్ట్‌ను సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడం వల్ల పారిశుద్ధ్య కార్మికులు నష్టపోనున్నా రు. అసలు కాంట్రాక్టర్ అయితే జీతాలు పూర్తిస్థాయి లో ఇస్తాడు. అదే సబ్ కాంట్రాక్టర్ జీతాలు సరిగ్గా ఇవ్వకపోగా.. కోత కూడా విధిస్తారు. గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో పారిశుద్ధ్య కార్మికుల్లో ఆం దోళన మొదలైంది. వీరికి నెలకు రూ. 6500 ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 2500 మాత్రమే ఇస్తున్నారు.