breaking news
String operation
-
నల్లగొండ జిల్లాలో కాలేజీ ఫీజులపై సాక్షి టీవీ స్ట్రింగ్ ఆపరేషన్
-
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
-
ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో జరిగిన హింసాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వర్సిటీ పరిధిలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే ఈనెల 5న జరిగిన దాడిలో పాల్గొనట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్ ఆవాస్థీ అనే ఏబీవీపీకి చెందిన విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియా ముందు ఒప్పుకున్నాడు. అంతేకాందు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరిస్తాడు. ఆయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసు విచారణ నిమిత్తం అక్షత్‌ను వెంటనే తమ ముందు విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. ఆయనతో పాటు ఆ రోజు ఘటనలో పాల్గొన్న మరో 37 మందిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. (మిస్టరీగా మిగిలిన ముసుగు దుండుగులు..!) మరోవైపు అక్షత్‌తో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని ఏబీవీపీ ఇది వరకే ప్రకటించింది. అయితే పోలీసుల విచారణ ఏ మేరకు నిజాలను రాబడుతోందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఢిల్లీ పోలీసులు ఇదివరకే బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయిషీ ఘోష్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. దీంతో పోలీసుల విచారణ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే తప్పుచేయలేదని, పోలీసులు కుట్రపూరింతంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. (ఎవరీ ఆయిషీ ఘోష్?) -
డబ్బులిస్తే మత ఘర్షణలు సృష్టిస్తామన్న నేతలు
న్యూఢిల్లీ: భారత్ లాంటి దేశంలో మత కల్లోలాలు చెలరేగడం, వాటిల్లో వందలాది మంది మృత్యువాత పడడం మనకు కొత్తేమి కాదు. ఆ మతకల్లోలాలను అవకాశంగా తీసుకొని రాజకీయం చేసే పార్టీల సంగతి తెలియందీ కాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బహిరంగ వేదికలపై రాజకీయ నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడము కూడా మనకు అనుభవమే. దేశంలో ఇప్పటివరకు జరిగిన మత కల్లోలాలన్నీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ప్రజల నుంచి అప్పటికప్పుడు అనూహ్యంగా వచ్చిన ఆక్రోశం ఫలితం అనుకుంటే పొరపాటే. అన్నీ కాకపోయిన కొన్నైనా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, డబ్బు కక్కుర్తితో జరిగినవన్న విషయం కూడా మనకు లీలామాత్రంగా తెలుసు. అందుకు ప్రత్యక్ష సాక్షాధారాలు దొరక్కపోవడానికి కారణం ఇంత వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిజాయితీతో దర్యాప్తు జరిపిన సందర్భాలు లేకపోవడమే. పార్టీలు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా కొంత మంది రాజకీయ నాయకులు డబ్బులకు కక్కుర్తి పడి తామే మత కల్లోలను సృష్టించి అమాయక ప్రజల మారణకాండకు కూడా వెనుకాడరనే విషయం ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలయింది. ఇండియా టుడే టీవీకి చెందిన ఓ జర్నలిస్టు ‘బ్లాస్ ఫెమస్ (దైవదూషణ)’ పేరిట ఓ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లో తీస్తున్నామని, ఇందుకు విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో భాగంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు, కల్లోలాలు సృష్టించాలంటూ కొంత మంది రాజకీయ నాయకులను ఆశ్రయించారు. పది రోజులపాటు కొనసాగిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బూటకపు డాక్యుమెంటరీ జర్నలిస్ట్ ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న హిందూ స్వాభిమాన్ సంఘటన్, ధర్మసేన యూనిట్‌కు చెందిన నాయకుడు పరమీందర్ ఆర్యాను కలుసుకున్నారు. తాము రాముడు అయోధ్యలో పుట్టలేదనే వాదనతో ఆయనకు వ్యతిరేక మైన కాన్సెప్ట్‌తో డాక్యుమెంటరీని తీస్తున్నామని చెప్పారు. ప్రజల దృష్టిలో ప్రజలకు ఆయన పట్ల ఉన్న ఇమేజ్ ప్రకారం పరమీందర్ ఆర్యా, రాముడికి వ్యతిరేకంగా సినిమా తీయడం ఏమిటంటూ అభ్యంతరం పెట్టాలి, తన వద్దకు వచ్చిన వ్యక్తిని ఈసడించుకోవాలి. ఆయన అదేమి చేయకపోగా, డాక్యుమెంటరీకి విస్తృత ప్రచారం కల్పించడం కోసం దానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో అంటే ఆ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తానని, అందుకు ప్రతిఫలం (డబ్బు) బాగా ముట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింల జిహాద్‌కు వ్యతిరేకంగా ఇటీవల యూపీలో కొంత మంది హిందూ యువతకు పరమీందర్ ఆర్య ఆయుధ శిక్షణ ఇప్పించిన వార్తలు పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన విషయం తెల్సిందే. ‘మీరు ఎక్కడైతే డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారని చెబుతారో అక్కడికి మా కుర్రాళ్లు యాభై మంది వచ్చి గొడవ చేస్తారు. గందరగోళం సృస్టిస్తారు. ముందుగా సూచిస్తే ఎవరి చొక్కాలు చింపమంటే వారి చొక్కాలను చింపుతారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కొట్టుకోవడం, రాళ్లు రువ్వడం లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ‘జో రామ్ కా నహీ కిసీ కా కామ్ కా నహీ, రామ్ కా అపమాన్, నహీ సహేగా హిందుస్థాన్’...లాంటి నినాదాలిస్తూ మా కుర్రవాళ్లు మీ సినిమా పోస్టర్లను, బ్యానర్లను చింపేస్తారు. డాక్యుమెంటరీకి సంబంధించి మీరు కూడా మీడియాలో స్టేట్మెంట్లు ఇవ్వండి, నేను కూడా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాను. మీడియా కవరేజ్ కూడా చూసుకుంటా. పెద్ద సమస్య కాదు. డీల్ పెద్దగా ఉండాలంతే. ఇప్పటి వరకు మీతో నాకు పరిచయం లేదు. అయినా ఫర్వాలేదు. నేను మాటిచ్చానంటే మాట మీద నిలబడతా. అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసేందుకు నాకు పది రోజుల సమయం కావాలి. ఇంతకు యాభై మంది కుర్రాళ్లు సరిపోతారా, ఇంకా ఎక్కువ మంది కావాలా? ఇందులో మా వాళ్లకు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉందికనుక డీల్ ఎక్కువగా ఉండాలి. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ కులుద్దాం. అప్పుడు డీల్ గురించి మాట్లాడుకుందాం, ఈలోగా ఫోన్లో మాట్లాడితే కోడ్ భాషలో మాట్లాడుకుందాం’ అన్న ఆర్య మాటలను జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత 2013లో హిందూ ముస్లింల అల్లర్లు చెలరేగిన ముజాఫర్‌నగర్‌కు బూటకపు డాక్యుమెంటరీ బృందం వెళ్లింది. అందులో ఓ జర్నలిస్టు బీజేపీ ఎమ్మెల్లే కపిల్ దేవ్ అగర్వాల్‌ను కలసుకున్నారు. ఆర్య ముందు వేసిన రికార్డునే ఆయన ముందు వేశారు. దానిపై ఆయన స్పందిస్తూ ‘ఈ డాక్యుమెంటరీ మీద గొడవ సృష్టిస్తే నామేమి వస్తుంది. దాని వల్ల మీకేమి లబ్ధి చేకూరుతుంది’ అని ప్రశ్నించారు. ఆ వెంటనే ఆయనే విషయాన్ని గ్రహించి ‘ఓహో! దీని వల్ల మీకు మీకు పబ్లిసిటీ లభిస్తుంది. నాకెంత ఇస్తారో తెలిస్తే చెబుతా, మళ్లీ కలుద్దాం’ అంటూ ఆయన వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత టీవీ జర్నలిస్ట్ మళ్లీ రెండోసారి కలసుకోగా విఫులంగా మాట్లాడారు. మా కుర్రాళ్లను పంపించి గొడవ చేయిస్తాను. సినిమాను బ్యాన్ చేయాలంటూ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. నా స్టేట్మెంట్ ద్వారా కూడా ఎక్కువ ప్రచారం లభిస్తుంది. నాకు ముట్టే డబ్బులు మాత్రం ఎక్కువగా ఉండాలి. డ బ్బుల ఆఫర్ నాకు నచ్చితేనే నేను పనిచేయిస్తా’ అని బీజేపీ ఎమ్మెల్యే మాటిచ్చారు. అనంతరం ఆ టీవీ జర్నలిస్టు సమాజ్‌వాది పార్టీ హరిద్వార్ యూనిట్ అధ్యక్షుడు హఫీజ్ మొహమ్మద్ ఇర్ఫాన్‌ను కలసుకున్నారు. ఈసారి ‘బ్లాస్ఫెమస్’ అనే డాక్యుమెంటరీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పారు. ‘నిరసనలు, ప్రదర్శనలు, వ్యతిరేక నినాదాలు అవేగదా, మీకు కావల్సిందీ?’ అని ఇర్ఫాన్ ప్రశ్నించగా, అంతకంటే ఎక్కువే కావాలి. ఘర్షణలు జరగాలి అని జర్నలిస్టు అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘నో ప్లాబ్లమ్. అన్ని జరిగిపోతాయ్. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే యాభై, అరవై కుర్రవాళ్లతో అనుకున్నది చేయించాలి. అందుకని ఐదు లక్షల ఇవ్వండి. మీడియా పబ్లిసిటీ కూడా చేసి పెడతా’ అని ఇర్ఫాన్ చెప్పారు. ఆ తర్వాత స్టింగ్ ఆపరేషన్‌పై ఇర్ఫాన్‌ను టీవీ జర్నలిస్ట్ అధికారికంగా ప్రశ్నించగా, నేను ఎలాంటి డీల్‌కు ఒప్పుకోలేదంటూ ఇర్ఫాన్ సమాధానం ఇచ్చారు. పరమీందర్ ఆర్యను వివరణ కోరగా, ఇది ప్రతిపక్షాల కుట్రని ఖండించారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధుల స్పందన కోరగా, టీవీ ఫుటేజ్‌ను పూర్తిగా తెప్పించుకొని చూశాక స్పందిస్తామని చెప్పారు. పైగా శాంతి భద్రతల సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదంటూ అర్థపర్థంలేని సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు మాత్రం తీవ్రంగా స్పందించాయి. ముందు నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టిస్తున్నవి ఈ రెండు పార్టీలేనని ఆరోపించాయి. స్టింగ్ ఆపరేషన్ చేసిన టీవీ జర్నలిస్ట్ అన్ని రాజకీయ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ఆఫర్లు ఇస్తే ఇంకెన్ని రాజకీయ పార్టీల నాయకులు దొరికేవారో, ఏమో! -
దొంగచాటు దాడి ఎందుకు?: కేజ్రీవాల్
బీజేపీ తనకు 5 ప్రశ్నలు సంధించడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. తెరచాటున దాక్కొని దాడి చేయొద్దని, తన బహిరంగ చర్చ సవాలును స్వీకరించి ప్రజలడిగే ప్రశ్నలకు జవాబివ్వాలని గురువారం బీజేపీని సవాలు చేశారు. ‘బహిరంగ చర్చకు రమ్మంటూ చాన్నాళ్లుగా అడుగుతున్నాను. దాక్కుని ప్రశ్నలడగడం ఎందుకు? బహిరంగంగా చర్చిద్దాం. రండి’ అని మరోసారి ఆహ్వానించారు. మేనిఫెస్టోకు బదులుగా దార్శనిక పత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్న బీజేపీ నిర్ణయాన్ని విమర్శిస్తూ.. ‘మేనిఫెస్టో లేదంటే.. ఢిల్లీ ప్రజలకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఎజెండా లేదని అర్థం’ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ కార్యకర్తలకు డబ్బు ఆశ చూపి ప్రలోభపెడుతున్నాయని ఆరోపించారు. ఎవరైనా డబ్బు ఆశ చూపి కొనడానికి ప్రయత్నిస్తే స్టింగ్ ఆపరేషన్ జరపాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు. -
డబ్బులిస్తే ఫలితాలను మార్చేస్తాం!
పోల్ సర్వే ఏజెన్సీల తీరిదేనన్న న్యూస్ ఎక్స్‌ప్రెస్ చానల్ న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్స్ వెనక పారదర్శకత లేదని తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు న్యూస్ ఎక్స్‌ప్రెస్ టీవీ చానల్ తెలిపింది. సర్వే ఏజెన్సీలు డబ్బుల కోసం ఫలితాలను వక్రీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఒపీనియన్ పోల్స్ నిర్వహించిన 11 ఏజెన్సీల బండారం తమ స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైందని న్యూస్ ఎక్స్‌ప్రెస్ ఎడిటర్ ఇన్ చీఫ్ వినోద్ కాప్రీ మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా ఇంకొన్ని పోల్ ఏజెన్సీలను సంప్రదించడానికి యత్నించగా అవి స్పందించలేదన్నారు. ఓటర్లను చైతన్యపరచేందుకే స్టింగ్ ఆపరేషన్ చేశామని, వివరాలను ఎన్నికల సంఘానికి అందజేస్తామని చెప్పారు. తమ విలేకర్లు పార్టీల దళారులుగా పోల్ ఏజెన్సీల అధిపతులను కలుసుకున్నారని, వారు ఎన్నికల ఫలితాలను ముడుపులను బట్టి రెండు రకాలుగా మార్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొంది. ఎన్నికల్లో గెలుపోటముల అంచనాలో పొరపాటు శాతం(మార్జిన్ ఆఫ్ ఎర్రర్) సాధారణంగా 3గా ఉంటుందని, దీన్ని ఐదు శాతానికి పెంచగలమని సీ-ఓటర్ ఏజెన్సీకి చెందిన యశ్వంత్ దేశ్‌ముఖ్ పేర్కొన్నట్లు తెలిపింది. ఈమేరకు స్టింగ్ ఆపరేషన్‌విగా పేర్కొంటూ కొన్ని సంభాషణలను రాతపూర్వకంగా విడుదల చేసింది. అయితే ఏ సర్వేలో వాస్తవాలను కప్పిపుచ్చారో వెల్లడించలేదు. గతంలో ఏ సర్వే ఫలితాలనైనా డబ్బుల కోసం మార్చేసినట్లు తమకు ఆధారాలు దొరకలేదని, మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాత్రమే తెలిసిందని పేర్కొంది. సీ-ఓటర్ పోల్స్‌ను నిలిపేసిన ఇండియా టుడే న్యూస్ ఎక్స్‌ప్రెస్ స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో ఇండియా టుడే గ్రూప్ తాము సీ-ఓటర్ ద్వారా చేయిస్తున్న అన్ని ఒపీనియన్ పోల్స్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. సీ-ఓటర్‌పై న్యూస్ ఎక్స్‌ప్రెస్ ఆరోపణలను పరిశీలిస్తున్నామని, సీ-ఓటర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని వెల్లడించింది.