breaking news
state Deputy Chief Minister
-
రైల్వే కోర్టుకు డిప్యూటీ సీఎం..
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోర్టుకు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. రైల్వే కోర్టు పోలీస్‌లు, న్యాయవాది చింతం సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2014లో కడియం శ్రీహరి, నాయకురాలు మమత కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని నష్కల్‌లో రైలురోకో చేశారు. ఈ మేరకు శ్రీహరి, మమతపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీహరి, మమత రైల్వే కోర్టులో హాజరుకాగా.. ఎగ్జామినేషన్ తర్వాత కేసు 2017 అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తు మెజిస్ట్రేట్ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. రైల్వే కోర్టుకు వచ్చిన కడియం శ్రీహరిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కలిశారు. కిషన్‌రెడ్డి, సునీత.. భువనగిరి రైలురోకో కేసుల్లో సోమవారం బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింత సాంబమూర్తి, మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన ఆలేరు ఎమ్మెల్యే సునీతతో పాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు నాయకులు కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఎగ్జామినేషన్ తర్వాత మెజిస్ట్రేట్ 2017 అక్టోబర్ 9వ తేదీకి కేసు వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపా రు. రైల్వే కోర్టుకు వచ్చిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు చింత సాంబమూర్తి, మనోహర్ రెడ్డికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ అర్బన్, రూ రల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తరవి, ఉడుతల బాబురావు, శివ, సదానందం స్వాగతం పలికారు. -
ఫ్యాక్షన్ రూపుమాపుతాం
కూడేరు/ ఆత్మకూరు/అనంతపురం క్రైం: అనంతపు రం జిల్లాలో ఫ్యాక్షన్‌ను పూర్తిగా రూపుమాపి.. అన్నివి ధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన కూడేరు, ఆత్మకూరు, కణేకల్లు పోలీసుస్టేషన్ భవనాలను, అనంతపురం అగ్నిమాపక కేంద్రంలో రూ.37 లక్షలతో ని ర్మించిన నూతన భవనాన్ని, పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, మెన్‌బ్యారక్, కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. జిల్లా పో లీసు కార్యాలయ ఆవరణలో ఁపోలీసు కంట్రోల్ రూం * నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భూకబ్జాలను, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. పోలీసు సే ్టషన్లను కార్పొరేట్ ఆఫీసులు లాగా నిర్మిస్తామన్నారు. ప్రజలు పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కకుండా గ్రామాల్లో ప్రశాంతంగా జీవించాలన్నారు. పోలీసులు కూడా ప్రజలకు అండగా నిలవాలన్నారు. గ్రామాల్లో గొడవలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో మార్పును పోలీసులే తేవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆధునిక హంగులతో అగ్నిమాపక కేంద్రాలు నిర్మిస్తామన్నారు. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా నడుచుకోవాలన్నారు. అమాయకులను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజలు గొడవలకు దూరంగా, అభివృద్ధికిదగ్గరగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ విప్ కాలవ శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ చమన్, డీజీపీ రాముడు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ శమంతక మణి, మేయర్ స్వరూప, మాజీ ఎమ్మెల్యే కేశవ్, ఐజీ గోపాలకృష్ణ, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, అగ్నిమాపక శాఖ ఐజీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల సమస్యలు పరిష్కరించండి.. జిల్లాలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్, నాయకులు వెంకటకృష్ణ, సుధాకర్‌రెడ్డి, హరి, మసూద్‌వలి, భారతి, సూర్యకుమార్ తదితరులు అనంతపురంలో వినతిపత్రం అందజేశారు. పోలీసుల తల్లిదండ్రులకు ఆరోగ్య భద్రత పథకం వర్తింపజేయాలని, జిల్లాకు టీఏ బడ్జెట్ పెంచాలని, పెండింగ్ ఉన్న టీఏ మొత్తం విడుదల చేయాలని, శిథిలావస్థకు చేరుకున్న పోలీసు క్వార్టర్స్‌లను మరమ్మతులు చేయించాలని కోరారు. సిబ్బంది కొరత అధిగమించేలా చూడాలన్నారు. వారాంతపు సెలవు విషయాన్ని పరిశీలించాలన్నారు. త్వరితగతిన పదోన్నతులు కల్పించాలన్నారు. అగ్నిమాపకశాఖలో పని చేస్తున్న హోంగార్డుల జీతాలు పెంచాలని ఆ శాఖ డీజీ సాంబశివరావును కోరారు.