breaking news
Star Attractions
-
నెట్టింటి వెరైటీ స్టార్స్..!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం యువతని ఉర్రూతలూ గిస్తున్న అధునాతన వేదిక సోషల్ మీడియా. ఇది కోట్లాది మందికి వినోదాన్ని విజ్ఞానాన్ని పంచుతుంటే.. వేలాది మందికి ఉపాధిగానూ మారుతోంది. ఈ నేపథ్యంలో సిటీ యువత తమలోని ప్రతిభకు సానబెడుతూ సోషల్ మీడియా వేదికగా విజయాలు సాధిస్తున్నారు. యూట్యూబ్, టిక్ టాక్.. ఇలా ఏదైనా సరే తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటూ లక్షలాది ఫాలోవర్లుగా మార్చుకుంటూ సోషల్ మీడియా స్టార్స్‌గా నిలుస్తున్నారు. ఫ్రాంక్‌గా.. తన యూట్యూబ్ చానల్లో 5 లక్షలకుపైగా అభిమానులతో వినోదాన్ని మేళవించి సందేశాత్మక వీడియోలతో స్టార్‌గా నిలిచాడు దిల్సుఖ్నగర్ వాసి వినయ్. అకస్మాత్తుగా ఎదురై అల్లరి పెట్టే ఫ్రాంక్ వీడియోలకు ఈయన ఫేమస్. 200కు పైగా ఫ్రాంక్ వీడియోలతో పాపులరై లక్షలాదిగా వ్యూస్‌ని కొల్లగొట్టాడు. సందేశాత్మకంగానూ, వినోదాత్మకంగానూ ఉండేలా కనీసం వారానికి 2 వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం అనాథ బాలలకు, చారిటీలకు అందిస్తుంటానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఒక టెలివిజన్ చానల్లో క్రియేటివ్ డడైరెక్టర్గా పని చేస్తూన్న ఆయన తన వీడియోస్‌కి వచ్చిన కామెంట్లలోని సూచనల ఆధారంగా తదుపరి ఫ్రాంక్స్ ప్లాన్ చేస్తుంటాడు. లాఫ్.. రాయల్ నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు నగరవాసి రాయల్ శ్రీ. హాస్య ప్రధానమైన డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లు చేస్తూ తన ఫన్నీ గెటప్‌లతో క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగో తరగతి మాత్రమే చదువుకున్నానని చెప్పే రాయల్.. అన్ని తరగతుల అన్ని వర్గాల మెప్పునూ పొందుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే యూట్యూబ్ చానల్లో వైరల్ అవుతున్నాడు. ఆరోగ్యకరమైన హాస్యం, ఎంటర్టైన్మెంట్ ఉండటంతో తనకు చాలా మంది అభిమానులుగా మారారని, నవ్వటం ఒక యోగం, అందరినీ నవ్వించగలగడం తన దృష్టం అని అంటున్నాడు రాయల్ శ్రీ. సంగీతాన్ని వండుతూ... ఆనందంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టుగా.. నవ్వుతూ తుళ్లుతూ వంట చేస్తూ ఆయన రూపొందించే టిక్‌టాక్ వీడియోలు విశేషాదరణ పొందాయి. ఆహారాన్ని ఆస్వాదిస్తే అదో వినూత్న అనుభూతి అని చెప్పకనే చెబుతూ, అసలు తినడానికి కూడా ఒక అర్హత ఉండాలి అంటాడు సైనిక్‌పురిలో నివసించే కల్యాణ్ నాయక్. తన వీడియోల ద్వారా తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరచుకున్నాడు. ప్రకృతి ప్రేమికుడు కావడం వల్లనేమో ఆయన వీడియోల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ఒక్కమాటలో జీవితమంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ కేరింగ్ అంటున్నాడు. తను మ్యూజిక్ కంపోజ్ చేసిన పిల్లా పిలగాడు ఆల్బమ్ వైరల్‌గా మారి ఏకంగా 5.4 మిలియన్స్ హ్యాష్‌ట్యాగ్స్‌ని సొంతం చేసుకుంది. ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో హ్యాష్‌ట్యాగ్స్ పొందడం విశేషం. ‘దీని ద్వారా వచ్చిన ప్రాచుర్యం 4 సినిమాలకు సంగీత దర్శకునిగా అవకాశాలను తెచ్చిపెట్టింది’ అని కల్యాణ్ నాయక్ చెప్పాడు. బీటెక్ పూర్తి చేసి ఇంట్లో వాళ్లు ఉద్యోగం చేయమని పోరుతున్నా వినకుండా.. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకున్నానని వివరించాడు. -
స్టార్ రిపోర్టర్
-
సీటీ బజాకే
స్టార్ అట్రాక్షన్స్.. సెలిబ్రిటీ విషెస్.. సాక్షి సిటీప్లస్ సక్సెస్ మీట్ కలర్ఫుల్గా కనువిందు చేసింది. ‘హండ్రెడ్ డేస్’ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ప్రోగ్రామ్‌కి ప్రత్యేక తళుకులు అద్దిన తారలు.. ‘సిటీప్లస్’ ఫీచర్స్‌తో మరింతగా తాము మమేకమవుతామని ప్రకటించగా, మరిన్ని విజయాలు సాధించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. శనివారం ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో వండర్‌ఫుల్‌గా జరిగిన ఈ ఈవెంట్ ఫుల్‌టైమ్ ఎంటర్టైన్మెంట్ను పంచింది. అతిథులందరికీ ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి జ్ఞాపికలను అందజేశారు. హే.. అన్నయ్యా.. స్టార్ రిపోర్టర్‌గా సంగీత దర్శకుడు కోటి ట్రాఫిక్ పోలీసులను ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ఆయన ‘ట్రాఫిక్ ఎడ్యుకేషన్ బస్’లో సీసీ టీవీ పుటేజ్‌ని వీక్షించారు. పుటేజ్‌ని చూపిస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ పాట హిందీ వెర్షన్లో ఉండడం గమనించి పాట తెలుగులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలుగు వర్షన్‌కు ట్యూన్ కూడా తానే అందిస్తానని చెప్పారు. వెంటనే లిరిక్స్ కోసం సినీకవి సుద్దాలను సంప్రదిస్తే.. అందుకు ఆయన ఓకే చెప్పారు. అన్నట్టుగానే సుద్దాల సాహిత్యానికి కోటీ సంగీతం అందించగా.. గాయకుడు పవన్ ఈ పాటను పాడారు. సిద్దూ సాలూరి కీబోర్డ్ సహకారం అందించారు. ఈ సీడీని సిటీప్లస్ సక్సెస్ మీట్లో మాజీ డీజీపీ అరవిందరావు ఆవిష్కరించారు. మొదటి సీడీని పంజాగుట్ట ఏసీపీ పద్మనాభరెడ్డికి ఇచ్చారు. పాట కంపోజింగ్ సమయంలో సుద్దాల కోటిగారు మధ్యన జరిగిన సంభాషణలో ‘ఈ పాట విని వేగం కన్నా ప్రాణం మిన్న అని ఒక్కరు గుర్తించినా చాలు’ అన్నారు సుద్దాల. ‘వేలపాటలకు సంగీతానిచ్చిన నాకు .. హే అన్నయ్యా.. అంటూ సాగే ఈ పాట స్పెషల్’ అన్నారు కోటి. స్టార్ రిపోర్ట్ తెలుగు దినపత్రికా రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు వేదికైన సాక్షి... సిటీప్లస్‌తో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని పలు రంగాల ప్రముఖులు ప్రశంసించారు. భాగ్యనగరంలోని భిన్న కోణాలను ప్రదర్శిస్తూ... పుట్టిన వందరోజుల్లోనే తనదైన ప్రత్యేకతను చాటుకున్న సిటీప్లస్... మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సాక్షి టవర్స్‌లో శనివారం నిర్వహించిన ‘సిటీప్లస్’ సక్సెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖులు సిటీప్లస్‌తో తమ అనుభవాలను, అనుభూతులను ఇలా పంచుకున్నారు. సినిమాల శతదినోత్సవ వేడుకల్లో పాల్గొంటే ఆనందం వస్తుంది. అయితే అంతకు మించిన ఆనందం సిటీప్లస్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ నాకు అందించింది. ఇంతమంది సినిమావాళ్లను రిపోర్టర్లుగా మార్చి సాక్షి చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. సాక్షి తరపున స్టార్ రిపోర్టర్‌గా నేను సీఆర్ ఫౌండేషన్‌కి వెళ్లి అక్కడ పెద్దల్ని పలకరించాను. వారు నాతో పంచుకున్న విషయాలు మర్నాడు పేపర్లో చూసుకున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. -జయసుధ, సినీనటి పోస్ట్మెన్ల జీవితాలను దగ్గరగా చూసే అవకాశాన్ని స్టార్ రిపోర్టర్ నాకు కల్పించింది. సిటీలో కొన్ని పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో పై ఫ్లోర్స్‌కు వెళ్లడానికి లిఫ్ట్‌లోకి పోస్ట్మెన్లను అనుతించడం లేదట... ఇలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన సమస్యలను తెలుసుకుని చాలా ఆవేదన చెందాను. ఒకప్పుడు పోస్టుమెన్ గొప్పతనాన్ని, నేటి పోస్టుమెన్ల సమస్యలు ‘మిత్రమా కుశలమా’ అంటూ వచ్చిన ఆర్టికల్ చాలామందిని పాతజ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. - తనికెళ్ల భరణి, నటుడు నా సినిమాలు 100 రోజుల వేడుకలు ఒకప్పుడు బాగా జరిగేవి. ఇప్పుడు అరుదై పోయిందనుకోండి. సిటీప్లస్ ఫంక్షన్లో పాల్గొనడంతో నాకు ఆ లోటు తీరింది. రిపోర్టర్‌గా మారి ట్రాఫిక్ పోలీసులతో సంభాషించడం నాకె న్నో విషయాలు తెలియజెప్పింది. అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గించడం సాధ్యమని అర్థమైంది. మామూలుగా ట్రాఫిక్ పోలీసులనగానే చాలామంది నెగటివ్‌గానే ఆలోచిస్తారు. అలాంటిది వారి తరపున ఒక పాజిటివ్, ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకొచ్చే ఇంటర్వ్యూ చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. -కోటి, సంగీతదర్శకుడు మానసికంగా ఎదగని చిన్నారుల్ని ఇంటర్వ్యూ చేసే పని నాకు అప్పగించారు. నిజంగా వారిని కలిశాక నాకు తెల్సిందేంటంటే.. మనకన్నా వాళ్లకి చాలా ఏకాగ్రత ఉంటుందని. దైవదర్శనానికి వెళ్లినప్పుడు స్పెషల్ దర్శనం అని ఉంటుందే.. అలాగే.. మనకు తెలీకుండానే వాళ్లని స్పెషల్ చేసేశాం. ఎప్పుడూ ఎవరూ పట్టించుకోని సెక్షన్ ఆఫ్ పీపుల్ని స్టార్లతో ఇంటర్వ్యూ చేయించే స్టార్ రిపోర్టర్ కాలమ్‌కి మంచి రెస్పాన్స్ ఉంది. నాలోని రిపోర్టర్ని బయటికి తీసుకొచ్చినందుకు సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు. -సునీల్, సినీహీరో ప్రకృతిని ఆరాధించేందుకు పుట్టుకొచ్చిన పండుగ బతుకమ్మ. కామంచి పూలు, కట్లపూలు... ఇలా ఎన్నో పుష్పాలను పూజించి, ఆటపాటలతో అర్చించే ఓ గొప్ప పండుగ ఇది. ఈ పండుగ చేసుకుంటున్న మహిళల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పూలు లేవు. ఆ పండుగ శోభ లేదంటూ అప్పటి జ్ఞాపకాలు నాతో పంచుకున్నారు. నన్ను రిపోర్టర్‌గా చేసిన సాక్షి కన్నా నాకే ఎక్కువ ఆనందం కలిగింది. -గోరటి వెంకన్న, రచయిత సెక్స్ వర్కర్స్‌ని ఇంటర్వ్యూ షరతు పెట్టి మరీ సిటీప్లస్ తరపున రిపోర్టర్‌గా చేశా. నేను టీనేజ్‌లో సెక్స్ వర్కర్ల కోసం ఒక పాట రాసేందుకు రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి వారితో సంభాషించా. అప్పటి జ్ఞాపకాలను ఈ రిపోర్టింగ్ నాకు తిరిగి తెచ్చి ఇచ్చింది. సెక్స్‌వర్కర్లను భర్తలు, ప్రేమికులే ఈ వృత్తిలోకి దింపుతారని వాళ్లు చెబుతుంటే...నాకు ఈ ప్రేమ, పెళ్లి అన్నీ ప్రశ్నార్థకంగా కనిపించాయి. ఆ చీకటి కూపం నుండి బయటపడలేక పడుతున్న ఇబ్బందుల గురించి వారు చెబుతుంటే నాలోని రిపోర్టర్ కలం పట్టాడు. ‘ఎగిరిపోతే..’ అంటూ వచ్చిన కథనం చాలామందిని ఆలోచింపజేసింది. -సుద్దాల అశోక్‌తేజ, రచయిత సిటీప్లస్కి రిపోర్టర్‌గా చేయమంటే మొదట్లో భయపడ్డా. తర్వాత ధైర్యం చేశా. ఆటోడ్రైవర్లతో మాట్లాడినప్పుడు పోలీసులు వారిని వేధిస్తున్నారని చెప్పారు. అయితే మరి మీరు చేస్తున్న తప్పులు, మీటర్ల మోసాలు ఏమిటని ప్రశ్నిస్తే... వాళ్లలో చాలా మంది పశ్చాత్తాపపడ్డారు. దీనికి నిదర్శనం ఏమిటంటే... నా స్టార్ రిపోర్టర్ పబ్లిష్ అయిన సిటీప్లస్ పేజీని చాలా మంది ఆటోవాలాలు తమ ఆటోల మీద అతికించుకుని తిరుగుతున్నారు. అందులో వాళ్లని విమర్శించిన విషయాలున్నా సరే వాళ్లు అలా అతికించుకున్నారంటే.. ఆ ఇంటర్వ్యూ వాళ్ల మీద చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. -పోసాని కృష్ణమురళి, నటుడు హ్యాపీగా ఉంది: మారుతి సమాజానికి ఉపయోగపడే స్టార్ రిపోర్టర్ వంటి ఫీచర్‌ను సిటీప్లస్ నిర్వహిస్తున్నందకు అభినందిస్తున్నానని దర్శకుడు మారుతి అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు హ్యాపీగా ఉందన్నారు. సాక్షి ఎటువంటి సామాజిక ప్రయోజనం ఉన్న కార్యక్రమం చేపట్టినా తప్పనిసరిగా నా మద్దతు ఉంటుందన్నారు. స్టార్ రిపోర్టర్ల అనుభవాలు తెలుసుకుంటుంటే ఇంకా నాకు ఆ చాన్స్ ఎందుకు రాలేదని అనిపిస్తోంది. నాకు అవకాశం ఇస్తే... తప్పకుండా నేను కూడా రిపోర్టింగ్ చేస్తా. -సాయిరామ్ శంకర్, సినీహీరో జర్నలిస్టులన్నా, జర్నలిజం అన్నా నాకు అపారమైన గౌరవం. నేను కూడా ఆర్ట్ కల్చర్ మీద దాదాపు 100కుపైగా వ్యాసాలు రాశాను. సిటీప్లస్లో వస్తున్న శీర్షికలు నాకు బాగా నచ్చాయి. నాకు అవకాశం ఇస్తే సిటీప్లస్లో రెగ్యులర్ ఫీచర్ రాయడానికి రెడీ. - భరత్‌భూషణ్, ఫొటోగ్రాఫర్ సినిమావాళ్లు చాలా మందికి నేను కర్రీలు సప్లయ్ చేస్తున్నా. కానీ ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు. మొదటి సారి సిటీప్లస్ వచ్చి అడిగితే... సరే అన్నా. ఒక్కసారిగా చాలా మందికి నా పేరు తెలిసిపోయింది. ఆ ఆర్టికల్ ఫోన్లో ఫొటో తీసి, దాన్ని పట్టుకుని నా అడ్రస్ వెతుక్కుంటూ ఎందరో వచ్చారు. - రామరాజు, రాజుగారి రుచులు రెస్టారెంట్ సిటీప్లస్ సక్సెస్ మీట్లో పాల్గొనడం అనందంగా ఉంది. సిటీప్లస్లో వచ్చిన వార్తతో మా రెస్టారెంట్ బాగా పాపులర్ అయింది. ఇక్కడికి వచ్చాక ఇంతమంది సినీ ప్రముఖులు సిటీప్లస్లో స్టార్ రిపోర్టర్లుగా తమ అనుభవాలు పంచుకుంటుంటే వినడం ఎంతో స్ఫూర్తి కలిగించింది. -వినయ్, కూచిపూడి వెంకట్ ఉలవచారు రెస్టారెంట్ సిక్స్‌ప్యాక్ గురించి నిజానికి సునీల్ ఎదురుగా మాట్లాడకూడదు. ఆయన రాష్ట్రంలోనే సిక్స్‌ప్యాక్‌కు క్రేజ్ తెచ్చారు. ఒకప్పుడు డయాబెటిస్, బీపీలతో బాధపడిన నేను ఆ తర్వాత ఫిట్‌గా మారి సిక్స్‌ప్యాక్ సాధించాను. ఏభై ఏళ్ల వయసులో సిక్స్‌ప్యాక్ అంటూ సిటీప్లస్లో రావడం వల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యాం అంటూ నాకు ఫోన్లు చేసి అభినందించారు. -రవీంద్రబాబు, అడ్వకేట్ మూగజీవాల హక్కుల గురించి, వాటికి రక్షణ కల్పించాల్సిన అవసరం గురించి ఒక ఎన్జీవో సంస్థను నిర్వహిస్తున్నాం. దీని గురించి సిటీప్లస్లో రావడం వల్ల మా వాలంటీర్ల సంఖ్య బాగా పెరిగింది. -నీహార్,యానిమల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కలర్స్ ఆఫ్ హైదరాబాద్ అన్నట్టుగానే సిటీలోని అన్ని కలర్స్ సిటీప్లస్ ద్వారా చూపిస్తున్నారు. కంగ్రాట్స్, - జయవంత్‌నాయుడు, హవాయిన్ గిటార్ సృష్టికర్త ఇంతమంది పెద్దల మధ్యలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు సిటీప్లస్కు కృతజ్ఞతలు. రకరకాల విషయాలు నేను మీడియాతో మాట్లాడాను కాని... నాకెంతో ఇష్టమైన జ్ఞాపకాలను మాత్రం సిటీప్లస్తోనే పంచుకున్నా. -సంపూర్ణేష్‌బాబు తెలంగాణ చిత్రకారులకు సాక్షి సిటీప్లస్ వచ్చిన తర్వాత చక్కని ప్రాధాన్యం లభిస్తోంది. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగిన ఆర్ట్ ఎట్ తెలంగాణ కార్యక్రమాన్ని కూడా చక్కగా కవర్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కళారంగంలో ఉంటూ ప్రాచుర్యానికి నోచుకోని చిత్రకారులు మరింత మందిని సిటీప్లస్ వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నా. -లక్ష్మణ్ ఏలె, చిత్రకారుడు