breaking news
stable condition
-
స్థితిమంతురాలైన భార్యకు భరణమా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి, స్థిరమైన ఆదాయం కలిగిన జీవిత భాగస్వామికి భరణం ఇవ్వజాలమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. శాశ్వత భరణం సామాజిక న్యాయం కోసం ఉద్దేశించినదే తప్ప, ఆర్థికంగా సమర్థులైన ఇద్దరు వ్యక్తుల మధ్య సంపదను సమానం చేయడానికి కాదని సష్టం చేసింది. భరణం కోరే వ్యక్తికి తనకు నిజంగా ఆర్థిక సాయం అవసరమని నిరూపించాల్సిన బాధ్యత ఉందని నొక్కి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఓ జంట విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు క్రూరత్వం ఆధారంగా విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం, భార్యకు శాశ్వత భరణం ఇచ్చేందుకు నిరాకరించడం సరైందేనని స్పష్టం చేసింది.2010 జనవరిలో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట 14 నెలల్లోనే విడిపోయింది. భర్త లాయర్ కాగా, భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) గ్రూప్ ’ఎ’అధికారి. భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని, దూషణ పదజాలం వాడిందని, అవమానకరమైన మెసేజ్‌లు పంపిందని, వైవాహిక హక్కులను నిరాకరించిందని, వత్తిపరమైన, సామాజిక వర్గాల్లో తనను అవమానించిందని భర్త ఆరోపించారు. ఈ ఆరోపణలను భార్య ఖండించింది, భర్తే తనను హింసించాడంటూ ప్రత్యారోపణలు చేసింది. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు, భర్త ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా, రూ.50 లక్షలిస్తేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.ఉన్నది ప్రేమ కాదు.. ఆర్థిక ప్రయోజనాలే..ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. పరిశీలించిన ధర్మాసనం, కింది కోర్టు తీర్పులో తప్పులేదని అభిప్రాయపడింది. ’విడాకులను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రేమ, ఆప్యాయతతో కాదని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. భార్య వైఖరిలో స్పష్టమైన ఆర్థిక కోణం ఉందని ఫ్యామిలీ కోర్టు తేల్చడం సమంజసమే’అని ధర్మాసనం పేర్కొంది. -
నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు. -
కోలుకుంటున్న సీఎం మేనల్లుడు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అభిషేక్‌కు సర్జరీ చేసినట్టు చెప్పారు. అభిషేక్ చికిత్స పొందుతున్న బెల్లె వ్యూ క్లినిక్ బుధవారం హెల్తె బులెటిన్ విడుదల చేసింది. బీపీ, పల్స్ రేట్ నిలకడగా ఉందని తెలిపారు. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ (29) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదం జరిగిన తర్వాత వారం రోజుల వరకు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. రెండు రోజుల నుంచి ఆయన బాగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.