breaking news
Srivasavi kanyaka parameswari
-
5 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ
-
వాసవీమాతను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్
ప్రొద్దుటూరు కల్చరల్: అమ్మవారిశాలలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరిదేవిని శనివారం రాత్రి ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్ ఆయనకు ఆలయ విశిష్టత, అమ్మవారి గొప్పతనాన్ని, మహిమలను, దసరా ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. శ్రీకాంత్‌కు శాలువా కప్పి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, మెమెంటోను ఇచ్చి సత్కరించారు. శ్రీకాంత్ వెంట మైస్టోన్ మెన్స్‌వేర్ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఎండీ వి.రామాంజనేయరెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యసభ కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, సభ్యులు పాల్గొన్నారు