శ్రీహరి కుటుంబానికి చేయూత
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌లో నేత కార్మికుడు వాసం శ్రీహరి కుటుంబాన్ని ఆర్డీవో భిక్షానాయక్ మంగళవారం కలిశారు. శ్రీహరి పరిస్థితి, ఆయన కూతుళ్లు సమత, మమతపై చదువులకు ఆర్థిక ఇబ్బందులపై ‘పేదింటి సుమాలు’ అనే కథనాన్ని ఈ నెల 1న ‘సాక్షి’ ప్రచురించింది. దీంతో జగిత్యాల పిల్లల వైద్యనిపుణులు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే రూ.60వేలు ఆర్థికసాయం ప్రకటించారు. కలెక్టర్ నీతూప్రసాద్ స్పందించారు. వాసం శ్రీహరి కుటుంబ పరిస్థితి, విద్యార్థినులు సమత, మమత వివరాలు నివేదించాలని ఆదేశించారు.
దీంతో ఆర్డీవో భిక్షానాయక్ రాజీవ్‌నగర్‌కు వెళ్లారు. ఇంటిపరిస్థితిని చూసి చలించిపోయారు. అంత్యోదయ కార్డును వెంటనే మంజూరుచేయాలని ఆదే శించారు. కూతురు సమత, కొడుకు వెంకటేశ్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలన్నారు. శ్రీహరి కుటుంబానికి డబుల్ బెడ్రూం పథకాన్ని మంజూరు చేసేలా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
కోనరావుపేట మండలం రామన్నపేటకు చెందిన సీహెచ్.మధుసూదన్‌రెడ్డి దుబాయ్నుంచి రూ.5వేలు, సింగాపూర్ నుంచి బీతీ రాజిరెడ్డి రూ.వెరుు్య మమత బ్యాంకు అకౌంటుకు పంపించారు. ఆర్టీవో వెంట సర్పంచ్ గొల్లపల్లి బాలగౌడ్, ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్ ఉన్నారు.