breaking news
Sri Ramachandra Murthy
-
సౌశీల్యం అంటే,,?
రాముడి పదహారు గుణాలలో ప్రత్యేక గుణం అని చెప్పదగినది సౌశీల్యం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు గుహుడి రాజ్యంలో ప్రవేశించాడు. అప్పుడు గుహుణ్ణి ‘‘ఆత్మవత్సఖః’’ అంటాడు. అంటే గుహుడు రాముడికి ఎంత అంటే తనతో సమానమైన వాడు. అరమరికలు లేకుండా ఎవరితో ఉండ గలడో అతడు. రాముడు వస్తున్నాడని తెలిసి గుహుడు వద్ధులైన మంత్రులతో కలిసి రాముడికి ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పటానికి. రాముడు తానే ముందుగా అతడిని పలుకరించి కౌగిలించుకున్నాడు. రాముడు చక్రవర్తి కుమారుడు. గుహుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక సామాన్యమైన వనచర రాజ్యానికి అధిపతి మాత్రమే. రాముడికి అటువంటి భేదాలు లేవు. రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించిన తరువాత సుమంత్రుడు రాముడి అంతఃపురంలో ప్రవేశించటానికి అనుమతి అడుగుతుంటే అటువంటిది అవసరం లేదు అంటాడు. తాను కాబోయే రాజు అయినా చిన్నతనం నుండి ఎత్తుకుని ఆడించిన వాడు కనుక తారతమ్యం చూపించ లేదు. జటాయువుని పక్షి అని చూడకుండా అంత్యక్రియలు నిర్వర్తించాడు. దశరథుడు కూడా అటువంటి సౌశీల్యం కలవాడు కనుకనే జటాయువుతో మైత్రి నెర΄ాడు. దేవతలు దశరథుడితో మైత్రి కలిగి ఉండటానికి ఈ గుణమే కారణమేమో! కృష్ణ సుధాముల మైత్రి కూడా ఇటువంటిదే. పైగా కుచేలుడుగా ప్రఖ్యాతి పోందిన సుధాముడు కృష్ణుడి ఐశ్వర్యాన్ని చూసి చనువుగా ఉండటానికి కొంచెం సందేహిస్తుంటే, తానే ఎదురు వెళ్ళి, తీసుకు వచ్చి, కాళ్ళు కడిగి, సకల మర్యాదలు చేసి, అతడిలో ఉన్న ఆ కాస్త బెరుకుని పోగొట్టటానికి గురుకులంలో గడిపిన కాలాన్ని గుర్తు చేస్తాడు. పైగా అతడికి ఏమీ ఇచ్చి పంపలేదు వెళ్లేటప్పుడు. అతడి లేమిని ఎత్తి చూపి, తన ఆధిక్యం చూపించుకున్నట్టు అవుతుంది అని. ఇంటికి చేరే సరికి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ సమకూర్చాడు. ఎంతటి సౌశీల్యం! దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాట తప్పి తనను చూడటానికి వచ్చిన ద్రోణుణ్ణి అవమాన పరుస్తాడు. తగిన ఫలం అనుభవించాడు. లోకంలో తరచుగా ఇటువంటివారే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. స్నేహానికి కూడా అంతస్తు చూస్తారు. అవసరానికి స్నేహం నటించటం ఉంటుంది. పని అయిపోయిన తరువాత అంతకు ముందు ఉన్న సుహద్భావం కనపడదు. అవసరం వచ్చి నప్పుడు అడ్డు రాని అంతస్తులు, హోదాలు, పదవులు, ఆర్థిక వ్యత్యాసాలు అప్పుడు కనపడతాయి. మరొక ప్రధానమైన గుణం – మిత్రులు తక్కువ స్థాయిలో ఉన్నారు కనుక వారిని తమ స్థాయికి తీసుకు రావటానికి ప్రయత్నం చేయరు. అంటే, వారి స్థాయిని గుర్తించినట్టే కదా! అది వారిని అవమానించినట్టే అవుతుంది. వారు ఉన్న స్థితి వారికి నచ్చినది, తప్తి కలిగించేది. వారికి కావలసినది ప్రేమ, ఆత్మీయత, ఆదరణ. దానిని చూపించటమే సౌశీల్యం. ఈ లక్షణం ఎంత అపురూపమో కదా! – డా. ఎన్. అనంత లక్ష్మి‘‘మహతః మందై స్సహ నీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం’’ జాతి చేత విద్య చేత ఐశ్వర్యం చేత చాలా గొప్పవాడైనా తన కంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండటం సౌశీల్యం.ఒక్కసారి మైత్రి ఏర్పడిన తరువాత అది జిడ్డు లాగా అంటుకు పోతుంది. అందుకే దానిని స్నేహం అన్నారు. స్నేహం అంటే నూనె, పట్టుకుంటే వదలని జిడ్డు అని అర్థం. చిన్నతనంలో ఇటువంటి తేడాలు తెలియవు కనుక అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఎదుగుతున్న కొద్ది దూరం జరగుతూ ఉంటారు. కానీ, సజ్జనులు అటువంటి భావాలని దారికి రానీయరు. -
ముక్కంటి ఆలయానికి రాజకీయ గ్రహణం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్ : దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. సీడీల పంపిణీ, భూ ముల కేటాయింపులో వ్యతిరేకంగా ఉన్నం దునే ఈవో శ్రీరామచంద్రమూర్తిని రాజకీయ పెద్దలు బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ముందుగా ఒప్పందం కుదుర్చుకునే ఇన్చార్జి ఈవోగా విజయకుమార్‌ను తీసుకొచ్చినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయ మహత్యం పేరిట 2006లో సీడీలను రూపొందించి రాహుకేతు పూజలు, రుద్రాభిషేకాలు, చండీహోమం చేసుకున్న భక్తులకు అందజేశారు. కాంట్రాక్టర్లు ఒక్కో సీడీని 65 రూపాయలకు ఆలయానికి విక్రయించారు. పదిహేను రూపాయలూ చేయని సీడీకి 65 రూపాయలను ఆలయాధికారులు చెల్లించారు. సీడీల పంపిణీ ఏడాది వరకు సాగింది. ఈ వ్యవహారంలో ఆలయానికి రెండు కోట్ల రూపాయలపైనే నష్టం వాటిల్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఫలితంగా సీడీల పంపిణీని రద్దు చేశారు. అయితే కొందరు నాయకులు తమకున్న రాజకీయ అండదండలతో సీడీల పంపిణీని ఇటీవల తెరపైకి తెచ్చారు. ఈ అంశంపై ఈవో శ్రీరామచంద్రమూర్తిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒక మంత్రి సైతం పలుమార్లు ఒత్తిడి తెచ్చి విఫలమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఇటీవల ప్రచారం చేశారు. కొందరు సీడీల పంపిణీని మళ్లీ తెరపైకి తేనున్నారని, ఈ ప్రతిపాదనను అడ్డుకుని ఆలయ సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ ఓ కారణం తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న పొన్నేరి వద్ద శ్రీకాళహస్తీశ్వరాలయానికి 27 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.54 కోట్లకు పైమాటే. వీటి మధ్యగా తన భూముల్లోకి రోడ్డు వేసుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మంత్రి ఇటీవల సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయంపైనా ఈవో శ్రీరామచంద్రమూర్తిపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. అయితే భూముల మధ్య రోడ్డు వేస్తే వాటి విలువ పడిపోతుందనే కారణంతో ఈవో విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో సహకరించని ఈవోను బదిలీ చేసేందుకు ఓ మంత్రి, ఆయన అండదండలు ఉన్న నాయకులు పావులు కదిపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆలయంలోని అక్రమాలను వారు వెలుగులోకి తెచ్చారని చెబుతున్నారు. విచారణ పేరుతో ఇటీవల కాలంలో హైడ్రామా నడిపారు. ఆలయంలో అక్రమాలు చోటుచేసుకున్నప్పటికీ ఈవో బదిలీ వ్యవహారంలో సీడీలు, భూముల వ్యవహారం ప్రధాన భూమిక పోషించినట్లు తెలుస్తోంది. సీడీలు, భూముల వ్యవహారంలో తమకు అనుకూలంగా ఆమోదముద్ర వేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాకే ఇన్చార్జి ఈవోగా విజయకుమార్‌ను సదరు వ్యక్తులు తీసుకువచ్చినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ఇద్దరు రీజనల్ జాయింట్ కమిషనర్లు (ఆర్జేసీ) ఉన్నప్పటికీ ఎక్కడో కృష్ణా జిల్లాలోని తిరుపతమ్మ ఆలయం నుంచి విజయకుమార్ రావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.