breaking news
sri krishan commitee
-
మన్యసీమకు ప్రత్యేక మండలి : చందా లింగయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మండలి ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ చందా లింగయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, మన్యసీమకు స్వయం పరిపాలన కోసం డిమాండ్ చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వనరులు పుష్కలంగా ఉన్న దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించాలని కోరారు. ఆదివాసీ డిమాండ్లపై జీవోఎంను కలిసి వినతిపత్రాన్ని అందచేసినట్టు చెప్పారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు గిరిజన, ఆదివాసీ ప్రాంతాలను కలిపి మన్యసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం ఆదివాసీ వ్యతిరేక చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరంపై శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను కూడా పట్టించుకోలేదన్నారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. -
బాబు బ్రాండు ఆత్మగౌరవమిది
అలాంటి వాళ్లల్లో వివి ధ ‘బ్రాండు’ల్లో ఉన్న రాజకీయ వేత్తలూ ఉన్నారు. మనిషి బొమ్మ వేసి దానికింద ‘మనిషి’ అని ఎందుకు రాశావురా! అం టే, లేకుంటే వాడిని ‘కోతి’ అను కుంటారన్నాడట వెనకటికొకడు. అలాంటి ‘కోతి’ చేష్టలకు మన నాయకులు చాలా కాలంగా అలవాటుపడిపోయారు కాబట్టి ముందు ముందు అలాంటి ‘బొమ్మ’లే ఎవడెటు వంటివాడో చెప్పడానికి అవసరమయ్యేలా ఉన్నాయి. అందుకే ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడంలో రాష్ట్రం లోని మూడు పార్టీలు తప్ప, అధికార పార్టీసహా మిగతా అమాంబాపతు పార్టీలూ, నాయకులూ పోటీలు పడుతు న్నారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైబడిన ‘చరిత్ర’ ఉన్నా, దేశ విభజనతో మొదలైన ‘విభజించి పాలిం’చే దాని బతు కంతా ఆచరణకూ క్రియాశీల రాజకీయాలకూ క్రమంగా దూరమవుతూనే ఉంది. ‘సెక్యులరిజం’ ముసుగు వేసినా, అందుకూ నిబడలేక పెడమార్గం తొక్కుతున్నది. అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ ఏకజాతి, భాషా సంస్కృతులతో తులతూగే ఆంధ్రప్రదేశ్ (విశాలాం ధ్ర) అవతరణను బలంగా సమర్థించిన తొలినాటి ఫజల్ అలీ కమిషన్ నివేదికకూ, ఇటీవలి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికకూ దురర్థాలు తీస్తోంది. భవిష్యత్తుతో జూదం... ఆ రెండు నివేదికలూ తెలుగు జాతిని సంఘటిత పర చగల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మాత్రమే మొదటి ప్రాధా న్యం ఇవ్వగా, ఆ నివేదికలను ఆనాడూ, ఈనాడూ చర్చకే పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఏకైక పార్టీ కాం గ్రెస్. తాజాగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా చర్చా పరిధి నుంచి తప్పించేసి దాదాపు తొమ్మిది కోట్ల ప్రజలున్న తెలుగు జాతి భవిష్యత్తుతో జూదమాడుతున్న పార్టీ కాంగ్రెస్. కాగా ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపైన అసలు తన అభిప్రాయమంటూ ఏమి టో తెలపకుండా ఆది నుంచీ ఆడుతున్న నాటకం ఒకటి కనిపిస్తుంది. అది- రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పక్షాలను తమ అభిప్రాయాలు చెప్పాలంటూ బరిలోకి గుంజడం! మిగతా పార్టీల అభిప్రాయాలు వెల్లడైనాక తాను బయట పడవచ్చునని కాంగ్రెస్ భావించింది. తీరా అందర్నీ ముగ్గు లోకి లాగిన తర్వాత, ప్రతిపక్షాలు దేనికదే కాంగ్రెస్‌కన్నా తామెక్కడ ‘వెనకబడి’ పోతామోనని తెలుగు జాతిని చీల్చ డానికే కంకణం కట్టుకుని, పోటీ పడి ‘విభజన’కు అను కూలంగా ఉత్తరాలు రాసిచ్చాయి. కాంగ్రెస్‌కు కావలసింది ఈ పరిణామమే. మిగతా పార్టీలు కొన్ని ‘విభజన’కు అను కూలం కాబట్టి, ‘మేము మాత్రం చేయగలిగిందేముంది’ అని నంగనాచి లాగా పార్టీ (కాంగ్రెస్) స్థాయిలో జాతిని చీల్చడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించి, రాష్ట్ర వ్యాపి తంగా ప్రకంపనలు సృష్టించి, తాను తీసుకున్న గోతిలో తానే పడి వివిధ ప్రాంతాలలో తన పునాదుల్ని పెకిలించు కుంటోంది! కాంగ్రెస్ చివరికి ఎంత వరకు ‘ఎదిగిందం’టే ఏ ముగ్గురు నలుగురు సొంత ప్రతినిధులతోనో ‘గుడగుడ లాడిం’ది తప్ప రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో గాని, కేంద్ర మంత్రులతో గాని, మాట మాత్రం కూడా చెప్ప కుండా రహస్యంగా ‘కథ’ నడిపింది. కాదన్న అత్త... అవునన్న కోడలు సోనియా కాంగ్రెస్‌కూ, ఇందిరమ్మ కాంగ్రెస్‌కూ ఇదే తేడా! అందుకే 1972లో ఇందిరా గాంధీ రెండవ అభిప్రాయానికి చోటివ్వకుండా దేశ ప్రయోజనాలతో పాటు తెలుగు జాతి ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని సుస్పష్టంగా రాష్ట్ర విభజనకు ససేమిరా అన్నది. జాతీయోద్యమంతో సంబంధమున్న నాయకులకూ, 1926-27 నుంచీ జాతీయ కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను గురించి పదే పదే చేసిన తీర్మానాలను ఆమోదించిన నాయకులకూ, ప్రజా వ్యతిరేక ‘సంస్కరణల’ పేరిట విదేశీ గుత్త వర్గాల ప్రభావంలోకి జారుకుని, దిగజారుడు రాజకీ యాలను, విధాన నిర్ణయాలనూ ఆశ్రయించిన నేటి కాం గ్రెస్ నాయకులకూ, వీరి అధిష్టానానికీ మధ్య ఇదీ తేడా! తాకట్లే ఆయన విధానం ఈ పూర్వరంగంలోనూ ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కు బేషరతుగా ఆహ్వానం పలికిన వాడూ, వరల్డ్ బ్యాంక్ మాజీ ఉన్నతాధికారీ, పీవీ క్యాబినెట్లో ఆర్థికమంత్రి, దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ అయినా, ఆ ‘సంస్కరణ ల’ను దేశంలో ముందుగా ‘ఆంధ్రప్రదేశ్’లో అమలుజరిపి రాష్ట్ర ఆర్థికవ్యవస్థను నట్టేట ముంచడానికి సాహసించిన వ్యక్తి చంద్రబాబే. ఆయన హయాంలోనే ప్రభుత్వరంగ పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రపంచ బ్యాంకు ఆదేశాల పైన రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులను ఏడాదికి సుమారు 2 శాతం చొప్పున తప్పించి, అమెరికాలో ఉన్న ‘కాంట్రాక్టు’ పద్ధతిలో గ్యారంటీ లేని ఉపాధి కల్పనకు అంకురార్పణ చేసిన వ్యక్తి చంద్రబాబు. వరల్డ్ బ్యాంకుకు విద్యుత్ రంగాన్ని కూడా తాకట్టు పెట్టడానికి, ప్రజలకు గాని, రాష్ట్ర విద్యుత్ శాఖకుగానీ ఎలాంటి బాధ్యత వహిం చని ప్రైవేట్ డెవలపర్లకు ‘డిస్కామ్’ల పేరిట విద్యుత్ పంపిణీ వ్యవస్థను కట్టబెట్టి ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని భారీగా రుణగ్రస్తురాలుగా మార్చిన ‘ఘనత’ ఆయనిదే! వ్యవసాయాన్ని పూర్తిగా అశ్రద్ధ చేసి, తద్వారా ఘటిల్లిన రైతుల ఆత్మహత్యలను పరిహారం కోసమే జరిగిన ఆత్మ హత్యలుగా చిత్రించి రైతాంగాన్ని న్యూనపరిచిన వ్యక్తీ బాబుగారే! ఉత్తరకాండ చివరికి వచ్చి వచ్చి ఇప్పుడు తెలుగు జాతిని చీల్చడంలో నర్మగర్భంగా కాంగ్రెస్‌లోని ‘దుర్యోధన వర్గ’ ప్రభుత్వంతో చడీ చప్పుడూ లేకుండా ‘ఉత్తర’కాండ నడిపిందీ బాబు గారే! అయినా తెలుగు జాతిని చీల్చడానికి ఎలాంటి వెరపూ లేని మాజీ ముఖ్యమంత్రి బాబుగారు విభజనకు అనుకూలంగా ఇచ్చివచ్చిన లేఖను ఉపసంహరించు కోకుండానే అందుకు జాతికి క్షమాపణ చెప్పకుండానే, విభజన జాతి వ్యతిరేక చర్య అని చాటకుండానే... విభజ నానంతర సమస్యల్ని గూర్చి తరచుగా ప్రస్తావించ బోవటం కుహనా రాజకీయం అవుతుంది. స్వార్థ ప్రయో జనాల కోసం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా జాతిని చీల్చవద్దన్నదొక్కటే ఆయన నినాదం కావాలి. ఏవో తనను కేసులు వెన్నాడతాయన్న భయమే బాబుకు లేక పోతే, కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీ లేఖను ఉపసంహరించు కోవడం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు కష్టమైన పనికాదు! ఆత్మ వంచనా... ఆత్మ గౌరవమా! కాగా, ఇప్పుడు చంద్రబాబు కోస్తాలో చేస్తున్న పని ‘ఆత్మ గౌరవ’ పోరాట యాత్రట! ఆ తెలుగుజాతి ‘ఆత్మ గౌర వాన్ని’ నిలబెట్టిన వారు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు మాత్రమేనని తెలుగువారికి తెలుసు! ఆనాడు కేంద్రం లోని బీజేపీ, ఎన్డీఏ పరివార్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు జాతిని చీల్చడానికి గజ్జెకట్టినట్టు కనిపించిన బీజేపీ ఆలో చనను తన పదవీ రక్షణలో భాగంగానే వ్యతిరేకించి ఉండ వచ్చు. అదే బాబు నేడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండికూడా, తనకెలాంటి అడ్డంకీ లేని పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీకి జాతి విభజనకు అనుకూలంగా ఉత్తరం రాయ డాన్ని కేవలం తనపై కోర్టులలో నానుతున్న కేసులకు భీతి ల్లేనన్న అభిప్రాయం ప్రజలలో రోజురోజుకీ ఘనీభవి స్తోందని ఆయన గ్రహించాలి! ‘ఉట్టిక్కెలేనమ్మ స్వర్గానికి నిచ్చెన’ వేసినట్టుగానే ఇప్పుడు బాబుగారి సరికొత్త నినా దం: ‘‘ఇటు రాష్ట్ర విభజనైనా, అటు రూపాయి పతనమైనా ఒక్క ఏడాదిలోనే’’ తాను పరిష్కరిస్తానని చెప్పడం ‘ఉత్తర కుమారు’డి నుంచి డెరైక్ట్‌గా వారసత్వం అందిపుచ్చుకో వడంగానే ప్రజలు భావిస్తారు! రెండు పడవలపైన కళ్లూ, కాళ్లూ కూడా మోపడం ‘ఆత్మగౌరవం’ కాదు, ‘ఆత్మ వంచనా’ శిల్పం. చిట్కాలన్నీ రాహుల్ కోసమే ఇక కాంగ్రెస్ అధిష్టానపు తాజా ‘చిట్కా’ కూడా ఉం ది. ‘సోనియా కాంగ్రెస్’ ఒక ప్రాంతంలోనైనా నెగ్గుకొస్తే... తాను ‘గుండుసున్నా’ ఫలితాలను ఊహిస్తున్న కోస్తాం ధ్రలో చీలుబాటలలో ఉన్న కాంగ్రెస్ వారితో ‘ఇందిరా కాం గ్రెస్’ పేరిట కొత్త కుంపటిని వెలిగించి... రెండు ప్రాంతా లలోనూ మోసపూరితంగా పార్టీని బతికించుకోగలిగితే... త్యాగాలతో నిమిత్తంలేని ప్రధాన మంత్రిత్వానికి రాహు ల్ను అర్హుడిని చేసుకోవచ్చు. ఆ నాటి నుంచి ఈ నాటి దాకా కుటుంబ సేవకు అలవాటుపడిన కాంగ్రెస్‌లో అను భవజ్ఞులు సహితం కాలానుగుణంగా మార్గనిర్దేశనం చేసు కోగల స్థితిలో లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికి ఈ వైపుగా కొంచెం స్వతంత్రంగా వ్యవహరించగల దమ్మున్న వాడు ఉన్నంతలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఒక్కడే కనబ డుతున్నారు! అసలు చిత్రమేమంటే- కాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ప్రజలచేత ‘ఛీ’ అనిపించుకున్న కాంగ్రెస్ నాయకులే అధిష్టానవర్గంలో కీలక స్థానాలు పొంది తెలు గుజాతి విభజన ప్రతిపాదనకు సాహసించడం. ‘కేసుల కత్తి’ నెత్తిమీద తాండవిస్తున్నంత కాలం సీమాంధ్రలో అవ తరించబోతున్న కొత్త కాంగ్రెస్ (ఇందిర పేరిట) పార్టీతో లోపాయకారీ ఒప్పందం లేదా అవగాహనతో చంద్రబాబు పార్టీ షరీకైతే ఎవరూ ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ రెండు పక్షాలకు ప్రస్తుత శత్రువు వైఎస్సార్సీపీ కాబట్టి, ఆ పార్టీ ప్రతిష్ట అధికార కాంగ్రెస్ ప్రజావ్యతిరేక చర్యల వల్ల మరిం త పెరిగే అవకాశాలున్నాయి. జాతిని చీల్చడంలో కాం గ్రెస్‌కు, టీడీపీకి ఉన్న ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ‘కప టకలహం’ అనివార్యం. కాబట్టి కోస్తాంధ్రలో ఇరు పక్షాలకూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీయే కావచ్చు! అందుకనే తనతో అటు చంద్రబాబు చేతులు కలిపేదాకా అతనిపై కేసులూ తెమలవు, ఇటు ఏనాటికైనా వైఎస్సార్ సీపీ మైలపడిన అధికార కాంగ్రెస్‌తో విలీనం కాగలదన్న ‘దింపుడు కల్లం’ కోర్కె నెరవేరదు కాబట్టి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై కేసు మరికొంత కాలం పెండింగ్‌లో ఉంటా యి! కనుకనే దేశానికీ, రాష్ట్రానికీ తిప్పలూ, కుప్పలు తెప్ప లుగా ఈ తప్పులూనూ! ఇక తెలుగు జాతి మరోసారి మోసపోరాదు. -
భవిష్యత్ అవసరాల కోసమే ఉద్యమం
రాయచోటి, న్యూస్‌లైన్: భవిష్యత్తు తరాల అవసరాలను గుర్తెరిగే ప్రజలంతా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర రాయచోటి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంల అందరి సమిష్టి కృషితోనే రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, అయితే నేడు తెలంగాణ వాదులు హైదరాబాద్ తమదంటుండడం దారుణమన్నారు. విభజన జరిగితే పూర్తిగా నష్ట పోయేది రాయలసీమే అని చెప్పారు. రాష్ట్రవిభజన విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి ఏమి తెలుసని ఎద్దేవా చేశారు. సుమారు రూ..105 కోట్లు వెచ్చించి ఏర్పాటుచేసిన శ్రీక్రిష్ణకమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతామంటూ ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. సమై క్యాంధ్ర జేఏసీ రాయచోటి కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విభజన ఉద్యమాన్ని సాకుగా తీసుకున్న కర్నాటక, మహారాష్ట్ర రాయలసీమ క్రిష్ణాబేసిన్లో లేదంటూ వాదిస్తుండటం వితండవాదమేనన్నారు. టిడిపి నాయకుడు ప్రసాద్‌బాబు, ఎన్‌జీఓసంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ నేతలు శ్రీనివాసరాజు, విఆర్ రెడ్డి, జనార్దన్, ఆర్టీసీ కార్మిక నాయకులు రామమోహన్,యహియాబాష, జమియత్ ఉలేమా నాయకుడు అజ్మతుల్లా, ప్రైవేటుస్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజులు ప్రసంగించారు. జెఏసీ నేతలు మనోహర్‌రాజు, నాగేశం, సాంబశివ, ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్లు పి. మనోహర్‌రెడ్డి, రమణారెడ్డి, శివగంగిరెడ్డి, ఎస్డిహెచ్ఆర్ డిగ్రీకళాశాల కరస్పాండెంట్ హరినాధరెడ్డి, సర్పంచ్ రవిరాజు, టిడిపి నేత ఇర్షాద్అలీఖాన్, డ్వాక్రా మహిళలు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు.