breaking news
	
		
	
  sports injuries clinic
- 
  
    
                
      లిగమెంట్ ఇంజురీ అంటే ఏమిటి..?
 - 
      
                   
                               
                   
            యువ వైద్యులతో సచిన్ సంభాషణ
ముంబై: రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన తన కెరీర్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు గాయపడ్డాడు. వాటిని అధిగమించి క్రికెట్ ఐకాన్‌గా నిలిచాడు. టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడిన మాస్టర్ ఆ అనుభవాన్ని యువ వైద్యులతో పంచుకున్నాడు. ‘స్పోర్ట్స్ ఇంజ్యూరీస్’ పేరిట ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సుధీర్ వారియర్ నిర్వహించిన ‘లైవ్ వెబినార్’ కార్యక్రమంలో సచిన్ స్వచ్ఛందంగా పాల్గొన్నాడు. 12,000 మంది యువ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సచిన్ క్రీడా గాయాలపై తన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు. సచిన్‌తో సంభాషించిన యువ వైద్యులు సాధారణ వ్యక్తులకు, క్రీడాకారులకు వైద్య చికిత్సలో అందించాల్సిన సేవలపై అవగాహన ఏర్పరచుకున్నారు. - 
      
                    
‘కేర్’లో స్పోర్ట్స్ ఇంజూరీస్ క్లినిక్

 గోపీచంద్ చేతుల మీదుగా ప్రారంభం
 సాక్షి, సిటీబ్యూరో: క్రీడల్లో భాగంగా గాయాలకు గురయ్యే క్రీడాకారులకు వైద్యం అందించేందుకు బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో ప్రత్యేక స్పోర్ట్స్ ఇంజూరీస్ క్లినిక్ ప్రారంభమైంది. రోడ్ నంబర్ 10లోని కేర్ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగంలో స్టేట్ ఆర్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఇంజూరీస్ పేరిట ఏర్పాటైన ఈ క్లినిక్‌ను శుక్రవారం జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గాయపడిన క్రీడాకారుల కోసం ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ.. గాయాలను సరిగ్గా విశ్లేషించి, గాయాన్ని త్వరగా నయం చేసేందుకు అవసరమైన చికిత్స అందించాలనే ఆలోచనతోనే ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీఎన్ప్రసాద్ మాట్లాడుతూ క్రీడాకారులకు అయ్యే క్లిష్టమైన గాయాలను గుర్తించి నయం చేసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కూడా సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇంజూరీస్ సర్జన్ డాక్టర్ శశికాంత్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్లు వేదప్రకాష్, ఆనంద్, రీతూ శర్మ తదితరులు పాల్గొన్నారు.
 


