స్పిన్నింగ్ మిల్లో అగ్నిప్రమాదం
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ శివారులోని సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మిల్లులో నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది.