breaking news
space car
-
ఇకపై పార్కింగ్ సమస్య ఉండదు!
హూస్టన్: ఆఫీస్, షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు కారు లేదా బైక్‌ను పార్క్ చేయడానికి ఎక్కడ ఖాళీగా ఉందా.. అని వెతకాడనికే సమయం వృథాకావటం చూస్తుంటాం. అమెరికాలోని అలబామా వర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మెట్టుపల్లి సాయినిఖిల్రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన పార్కింగ్ యాప్స్ కంటే భిన్నంగా స్పేస్ డిటెక్టింగ్ పద్ధతిలో దీనిని అభివృద్ధి చేశారు. బిగ్‌డేటా ఎనలిటిక్స్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ సాయంతో డేటాను విశ్లేషించి డ్రైవర్లు నేరుగా పార్కింగ్‌లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుందో చెబుతుంది. ఈ ఆవిష్కరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ హౌస్ పోటీ (2018)ల్లో రెండో బహుమతి వచ్చింది. -
స్పేస్ కారు!
పేరు వినగానే ఇదేదో అంతరిక్షంలో తిరిగే కారు అనుకుంటున్నారు కదూ! కానే కాదు. ఇది స్పేస్‌లో నడిచే కారు కాదు. అత్యంత తక్కువ స్పేస్‌లో ఇమిడే కారు. వాహనంతో రోడ్డెక్కాలంటే భయపడాల్సిన రోజులివి. ట్రాఫిక్‌జామ్‌లు, మళ్లింపుల గందరగోళాలు. ఈ బాదరబందీలేవీ లేకుండా ఎంచక్కా కారులో కూర్చుని కాఫీ తాగుతూ, లేదంటే వార్తలు చదువుకుంటూ ఆఫీసుకెళ్లిపోగలిగితే ఎలా ఉంటుంది? వినడానికి భలేగా ఉంది కానీ అదెలా సాధ్యం అంటారా? సాధ్యమయ్యే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ఒకపక్క గూగుల్, ఇంకోపక్క ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలు డ్రైవర్ల అవసరం లేని కార్లను రోడ్లపైకి తెచ్చేశాయి. దీంతో సగం సమస్యలు పరిష్కారమైనట్లే. వీటికి జనరల్ మోటార్స్ సంస్థ రెండేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయం చేసిన ‘ఎన్–వీ’ (ఫొటోలలో కనిపిస్తున్నది) కూడా తోడైందనుకోండి... ట్రాఫిక్‌జామ్‌లు అనేవి గతకాలపు వార్తలైపోతాయి. ఇంతకీ ఏంటి ఈ ‘ఎన్–వీ’ ప్రత్యేకత?! ఇద్దరు ప్రయాణించేందుకు అనువైన ఈ ఎన్–వీ కారు హైటెక్ టెక్నాలజీల పుట్ట. కళ్లు, చెవుల మాదిరిగా వీటి సెన్సర్లు పరిసరాలను గమనిస్తుంటాయి. అలాగే మిగిలిన అన్ని వాహనాలతోనూ ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుకోవడమే కాకుండా అవసరానికి తగ్గట్టు తమ దిశలు కూడా మార్చుకుంటాయి. కుయ్... కుయ్... కుయ్‌మన్న అంబులెన్స్ హారన్ వినిపించిందనుకోండి... అంబులెన్స్ ఏ దిశగా వస్తోంది, ఎంత వేగంతో వస్తోంది, ఎటు వెళితే దానికి సౌకర్యంగా ఉంటుందో లెక్కకట్టి తగిన విధంగా దారిస్తుంది ఈ కారు. ఇంకో విషయం.. ఎన్–వీతో పార్కింగ్ సమస్యలు అస్సలుండవు. అతి తక్కువ సైజు ఉండటం ఒక కారణమైతే.. కదిలే విడిభాగాలు అతి తక్కువగా ఉండటం వల్ల దీన్ని తల్లకిందులుగానైనా ఎక్కడో ఒకచోట పార్క్ చేయవచ్చు. స్పేస్ సేవ్ చేసే స్పేస్ ఏజ్ కారన్నమాట!