breaking news
Somalingappa
-
బీజేపీకే అనుకూల పవనాలు
సోమలింగప్ప సిరుగుప్ప : తాలూకాలో వీస్తున్న బీజేపీ అనుకూల పవనాలకు ఈసారి ఏపీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూకటి వేళ్లతో పతనమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్.సోమలింగప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం స్థానిక మంజునాథ కల్యాణ మంటపంలో వచ్చే నెలలో జరుగనున్న సిరుగుప్ప వ్యవసాయ మార్కెట్ యార్డు ఎన్నికల సమీక్ష సమావేశంలో కార్యకర్తల నుద్ధేశించి మాట్లాడుతూ వచ్చే నెలలో జరుగనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు ఎన్నికల్లో 11 స్థానాలకు గాను 9 స్థానాలను కై వసం చేసుకొని బీజేపీ సత్తా ఏమిటోనని మరోసారి కాంగ్రెస్ పార్టీకి చూపించాలని పిలుపు నిచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో రైతుల కోసం నవంబరు 20 వరకు ఎల్ఎల్సీ కాలువకు తుంగభద్రా డ్యాం నుండి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సభ్యులు, తాలూకా పంచాయతీ సభ్యులు, నగరసభ సభ్యులు, పార్టీ తాలూకా అధ్యక్షులు, తాలూకా ఎస్టీ మోర్చా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది
= కళంకితులకు మంత్రి పదవులపై 6న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన = బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప సాక్షి, బళ్లారి : కళంకితులకు మంత్రి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ నిజస్వరూపం ఏమిటో బయట పడిందని రాష్ట్ర ఎస్టీ మోర్చా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని మయూర హోటల్లో విలేకరులతో మాట్లాడారు. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు అన్న చందంగా అక్రమ గనుల తవ్వకాలపై పాదయాత్ర చేసి, తర్వాత అదే అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులు డీకే శివకుమార్, రోషన్‌బేగ్‌లకు మంత్రి పదవులు ఇచ్చిన సిద్ధరామయ్య ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డీకే శివకుమార్, రోషన్ బేగ్‌లకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 6న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందన్నారు. బీఎస్‌ఆర్‌సీపీ అధినేత బీ.శ్రీరాములును బీజేపీలోకి త్వరగా వచ్చే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలని, అదే విధంగా బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున శ్రీరాములును పోటీలో పెట్టే విధంగా పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. బళ్లారి ఎస్టీ వర్గాలకు రిజర్వ్ అయినందున శ్రీరాములు బీజేపీ తరుపున సమర్థుడైన అభ్యర్థి అని గుర్తు చేశారు. శ్రీరాములు వెంట తామందరం ఉంటామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. అవినీతి పరులకు మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ తప్పిదం చేస్తోందన్నారు. యడ్యూరప్ప బీజేపీలోకి తిరిగి రానుండటంతో బీజేపీకి కొండంత బలం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ధరలు అదుపు చేయకపోగా, గ్యాస్ ధరలు కూడా పెంచడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రయ్య, విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు.