breaking news
snehareddy
-
Allu Arjun-Sneha Reddy: బన్నీ-స్నేహాల జోడీ ఎంత బావుందో.. స్టైలిష్ కపుల్ (ఫోటోలు)
-
రాజస్థాన్‌లో బన్నీ టూర్.. వైరలవుతున్న వీడియో
ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా విరామం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజస్థాన్‌లో ఫ్యామిలీతో కలిసి పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ వ్యాకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అలాగే ఓ నేషనల్ పార్క్‌లో అల్లు అర్జున్ పులిని ఫోటో తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా.. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు బన్నీ. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. రణథంబోర్ నేషనల్ పార్కులో దూరంగా ఉన్న పులిని తన పిల్లలకు చూపిస్తూ కనిపించాడు బన్నీ. అయితే పుష్ప-2 షూటింగ్లో మళ్లీ త్వరలోనే మళ్లీ బన్నీ జాయిన్ అవ్వాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning 🔥😍😍@alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y — KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ 🪓 (@KarthikAADHF__) February 28, 2023 View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్
-
అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్
నల్లగొండ: ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..దసరా పండుగకు బ్రేక్ తీసుకున్నాడు. బన్నీ ఈసారి దసరా పండుగను ఈ సారి తన అత్తగారి ఊళ్లో జరుపుకున్నాడు. స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్లొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల అయిన రుద్రమదేవి సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్ర డైలాగ్స్ చెప్పాలంటూ గ్రామస్తులు కోరగా... డైలాగ్స్ వినిపించి వారి ముచ్చట తీర్చాడు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది.