breaking news
small vehicles
-
కొత్త రకం వాహనాలు, ఎలా ఉన్నాయో చూడండి
కొత్త రకం చిన్న వాహనాలు-క్వాడ్రిసైకిల్స్‌కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రోడ్డు రవాణా, ప్రధాన రహదారుల మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించింది. నాలుగు చక్రాలు కలిగిన ఈ కొత్త రకం వాహనాలు, పర్సనల్ వెహికిల్స్‌గా, కమర్షియల్ వెహికిల్స్‌గా వాడుకోవచ్చని తెలిపింది. వీటికి సంబంధించిన ఉద్గారాలు, క్రాష్, ఇతర నిబంధనల జాబితాను ప్రభుత్వం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఏఆర్ఏఐలు కలిసి నిర్దేశించనున్నాయి. ఈ కేటగిరీలో తొలి వాహనం బజాజ్ లాంచ్ చేయనుంది. బజాజ్ క్యూట్ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో ఇలాంటి స్పెషల్ కేటగిరీ వాహనాలు లేవు. అయితే ఈ వాహనాలపై ఏ మేర జీఎస్టీ రేటు అమలు చేస్తారో ప్రభుత్వం ఇంకా స్పష్టీకరించలేదు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న గ్రీన్ ప్లేట్ల మాదిరిగా ఈ వాహనాలకు స్పెషల్ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనాలు 475 కేజీల కంటే తక్కువ బరువు ఉన్నాయి. ఇంకా పొడవు, వెడల్పు కొలతల గురించి సరియైన క్లారిటీ లేదు. ఈ కేటగిరీ వాహనాల వివరాలపై త్వరలోనే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ సర్క్యూలర్ జారీచేయనుంది. ఈ క్వాడ్రిసైకిల్ భారత్‌లో అత్యంత కఠినమైన క్రాష్ టెస్ట్ ప్రొగ్రామ్‌ను కూడా పాస్ కావాల్సి ఉంది. అంతేకాక పెట్రోల్, డీజిల్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వాహన ఉద్గారాల టెస్ట్‌లను కూడా ఈ వాహనాలపై నిర్వహించనున్నారు. ఫుల్ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ క్వాడ్రిసైకిల్స్‌కు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనాలను భారత రోడ్లపై అనుమతించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రోడ్లపై క్వాడ్రిసైకిళ్లు సురక్షితమైనవి కావని, ఇవి లోపపూరితమైన డిజైన్‌ను కలిగి ఉన్నావని పలువురంటున్నారు. -
కార్లకు, చిన్న వాహనాలకు టోల్ టాక్స్ రద్దు!
అహ్మదాబాద్ : కార్లు, చిన్న చిన్న వాహనదారులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక. ఆగస్టు 15 నుంచి ఈ వాహనదారులు టోల్ టాక్స్ ను చెల్లించాల్సినవసరం లేదట. అయితే ఈ కానుక ఏ రాష్ట్రంలో అనుకుంటున్నారా..! ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ కానుకను ఎంజాయ్ చేయొచ్చట. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వాల్సాడ్ జిల్లాలో 67వ వాన్ మహోత్సవ ఫంక్షన్ సందర్భంగా ఆమ్రా వాన్ ఆవిష్కరణోత్సవ స్పీచ్ లో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఆగస్టు 15 నుంచి కార్లు, చిన్న వాహనాలను టోల్ టాక్స్ చెల్లింపు పరిధి నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. కమర్షియల్,పెద్ద వాహనాలకు టోల్ టాక్స్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతికి చెందిన సోదరీ, సోదరులు ఇక నుంచి పనిచేయడానికి వారి కార్లలో బయటికి వెళ్లొచ్చని ప్రకటించారు. ఈ మినహాయింపు ఖర్చును గుజరాత్ రాష్ట్రం భరిస్తుందని పేర్కొన్నారు. అయితే జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్స్ కు ఈ నిర్ణయం వర్తించదని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావని వెల్లడించారు.