breaking news
Slipper Thrown
-
బీహార్ సీఎం నితీష్ కుమార్కు చేదు అనుభవం!
-
నాపై దాడికి చంద్రబాబే కారణం : కన్నా
సాక్షి, అమరావతి: తనపై దాడి జరగడానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబు నాయకత్వంలోనే జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ నేతల అవినీతిని ప్రజలకు తెలిజెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో బుధవారం సాయంత్రం ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రాభివృద్ధికి ఎవరెంత పనిచేస్తున్నారో తెలియజేస్తున్నందున భరించలేక ఇటువంటి భౌతిక దాడులు చేస్తున్నారని వాపోయారు. ఈ దాడులు అన్నింటికీ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా చంద్రబాబు నాయకత్వం లోనే జరుగుతోంది. ఇవి అన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న హింస దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. — Kanna Lakshmi Narayana (@klnbjp) July 4, 2018 -
మంత్రిపై చెప్పు విసిరిన మహిళ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్పై ఓ మహిళ చెప్పు విసిరింది. మంగళవారం మధ్యాహ్నం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం బయట భావన అరోరా అనే ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త జైన్పై చెప్పు విసిరింది. ఆయన కొద్దిలో తప్పించుకోగా, చెప్పు వాహనంపై పడింది. ఆ సమయంలో వాహనంలో ఆయనతో పాటు ఆప్ నేతలు సంజయ్ సింగ్, అశుతోష్ ఉన్నారు. భారత్ సైన్యం చేసిన సర్జికల్ దాడులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే దాడిచేశానని భావన చెప్పింది. ఆప్ నేతలు పాకిస్థాన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసుకు సంబంధించి జైన్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.