breaking news
slap journalists
-
చేయి చేసుకున్న సీనియర్ నటులు
-
చేయి చేసుకున్న సీనియర్ నటులు
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటులు రిషి కపూర్, రణదీర్ కపూర్ జర్నలిస్టులు, అభిమానులపై చేయి చేసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సహనం కోల్పోయి దాడికి పాల్పడ్డారు. ముంబైలోని చెంబర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. గణేశుడి విగ్రహం నిమజ్జనం చేయడానికి రిషి, రణదీర్, రణబీర్ కపూర్ నాలుగు కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇదంతా కవర్ చేసేందుకు జర్నలిస్టులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కెమెరామన్ పై రణదీర్ చేయి చేసుకున్నాడు. రిషి కపూర్ కూడా రిపోర్టర్ ను కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తమ చుట్టూవున్న జనాన్ని రిషి, రణదీర్ తోసివేస్తున్నట్టుగా వీడియోలో కనబడింది. తనతో మాట్లాడేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల రణదీర్ దురుసుగా ప్రవర్తించినట్టు వెల్లడైంది. జర్నలిస్టులపై రిషి, రణదీర్ దాడి చేయడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుబట్టారు.